సినీ పరిశ్రమలో పెరుగుతున్న విషాదాల సంఖ్య అందరినీ కలవరపరుస్తోంది.నిత్యం ఎవరొకరు పలు కారణాల వల్ల మరణిస్తూనే ఉన్నారు. ఈ మధ్య మనం చూసుకుంటే మలయాళ నటుడు విష్ణు ప్రసాద్, ఫిలిప్పీన్స్ నటుడు రికీ దవావో, నిర్మాత తేనెటీగా రామారావు, ‘సింటోనియా’ నటి బ్రెజిలియన్ చైల్డ్ ఆర్టిస్ట్, బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ గా పేరొందిన విక్రమ్ గైక్వాడ్, కమెడియన్ రాకేష్ పుజారి, మాస్టర్ భరత్ తల్లి కమలహాసిని వంటి వారు మరణించారు.
ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే… మరో నటుడు మరణించడం అందరికీ పెద్ద షాక్ ఇచ్చినట్టు అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ‘కృష్ణ’ (Krishna) ‘అదుర్స్’ (Adhurs) సినిమాల్లో విలన్ గా చేసి మెప్పించిన ముకుల్ దేవ్ (Mukul Dev) నిన్న అంటే శుక్రవారం (మే 23న) మృతి చెందారు. ఇతని వయసు 54 ఏళ్ళు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఈయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతూ వస్తున్నారు.
అయితే పరిస్థితి విషమించడంతో నిన్న కన్నుమూసినట్టు తెలుస్తుంది. మరో టాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్‌కు ఇతను సోదరుడు అనే సంగతి చాలా మందికి తెలీదు. రవితేజ (Ravi Teja) కృష్ణ సినిమాలో ఇతను విలన్ గా మెప్పించాడు. ఆ సినిమాలో బ్రహ్మానందంని (Brahmanandam) విజిల్ వేయమని చెప్పే సీన్ నెక్స్ట్ లెవెల్లో వైరల్ అయ్యింది. తర్వాత ప్రభాస్ (Prabhas) ఏక్ నిరంజన్ (Ek Niranjan).. ఎన్టీఆర్ (Jr NTR) ‘అదుర్స్’ సినిమాల్లో కూడా విలన్ గా చేసి మెప్పించాడు. ఇతని మృతి పట్ల టాలీవుడ్ నటీనటులు.. నెటిజన్లు సంతాపం తెలుపుతున్నారు.