Adipurush: ‘ఆదిపురుష్’ నుండి ఆకట్టుకునే ‘రామ్ సీతా రామ్’ పాట!

ఈ ఏడాది సీనియర్ స్టార్ హీరోలే సందడి చేశారు కానీ.. స్టార్ హీరోల సినిమాలు ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. ఆ రకంగా చూసుకుంటే 2023 లో రాబోతున్న మొదటి స్టార్ హీరో సినిమా ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’. ట్రైలర్ తో ఈ చిత్రం పై అంచనాలు పెరిగాయి. ‘జై శ్రీరామ్’ అనే పాట ఆ అంచనాలను డబుల్ చేసింది. ఇండియా వైడ్ ఆ పాట ట్రెండింగ్లో నిలిచింది అని చెప్పాలి.

తాజాగా ‘రామ్ సీతా రామ్’ అనే మరో పాట కూడా రిలీజ్ అయ్యింది. రాఘవ్(శ్రీరాముడు), జానకి(సీతా దేవి)ల మధ్య ఉన్న ప్రేమను తెలుపుతూ ఈ పాటని చిత్రీకరించడం జరిగింది. ప్రభాస్, కృతి సనన్ సీతారాములుగా కనిపించారు. వీరి జంట ఆకట్టుకుంటుంది. సచేత్-పరంపర సంగీతంలో రూపొందిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఈ పాట వింటుంటే చాలా ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడిన ఫీలింగ్ కలుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.

రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం.. బాగా కుదిరింది. కొన్ని విజువల్స్ చూస్తే ఎమోషనల్ కూడా అనిపిస్తున్నాయి. మొదట ‘ఆదిపురుష్’ మ్యూజిక్ పై అందరికీ సందేహం ఉండేది. కానీ ‘జై శ్రీరామ్’ ‘రామ్ సీతా రామ్’ వంటి పాటలు ఆ అనుమానాలను పటాపంచలు చేశాయని చెప్పాలి. (Adipurush) ‘ఆదిపురుష్’ పై టీజర్ తో నెలకొన్న నెగిటివిటీని పోగొట్టడంలో ట్రైలర్ తో పాటు మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. ఇక ‘రామ్ సీతా రామ్’ పాటను మీరు కూడా ఒకసారి వినెయ్యండి :

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus