Adipurush: గూస్ బంబ్స్ తెప్పిస్తున్న జై శ్రీరామ్ సాంగ్!

ప్రభాస్ సినిమాలు అంటే మాములుగానే జనాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.. అలాంటి విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు జనాలు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కొత్తగా ఉంది.. రామాయణం కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో కనిపించునున్నారు.. ఆదిపురుష్ కి సంబందించి ఎన్ని టీజర్లు, వీడియోలు వచ్చినా.. సినిమా మొత్తం మీద ఆడియన్స్ ని ఆకట్టుకున్నది ఒక్కటంటే ఒక్కటి.

అదే జై శ్రీరామ్ పాట. జస్ట్ బిట్ సాంగ్ తోనే ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు ఈ పాటకి. అలాంటి క్రేజ్ ఉన్న జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది.. కేవలం రిలీజ్ అయిన కొద్ది క్షణాల్లోనే తెగ ట్రెండ్ అవుతుంది..మొన్న టీజర్ తో వచ్చిన నెగెటివిటీతో కాస్త డల్ అయిన ఆదిపురుష్ యూనిట్ కి ట్రైలర్, జై శ్రీరామ్ సాంగ్ బిట్ హిట్ అవ్వడం మంచి బూస్టప్ ఇచ్చింది. ఇప్పటి వరకూ ఫస్ట్ లుక్ టీజర్ మీద నుంచి వచ్చిన నెగెటివిటీ కాస్త ఈ సాంగ్ తో కొట్టుకుపోయిందనే చెప్పాలి.

ఈ సాంగ్ తో పాటు ట్రైలర్ కూడా సినిమా (Adipurush) మీదున్న ట్రోలింగ్ ని తగ్గించింది. ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా 600కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ జూన్ 16నే రిలీజ్ కి రెడీ అవుతుండడంతో ఇప్పటి నుంచి ప్రమోషన్లు చెయ్యడమే పనిగా పెట్టుకుంది టీమ్.. ఈ సినిమా విడుదలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో సినిమా ప్రమోషన్స్ గట్టిగా స్టార్ట్ చెయ్యకపోయినా, ఆడియన్స్ లో సినిమా మీద నమ్మకం కలిగించకపోయినా ఆదిపురుష్ కి గట్టిదెబ్బ తగిలే చాన్సుంది.

అందుకే ఇప్పటినుంచైనా ఫాన్స్ మెచ్చేలా ప్రమోషన్లు చెయ్యాలని ఫిక్స్ అయ్యింది టీమ్. సినిమాకి మంచి పాజిటివ్ టాక్ తెచ్చిపెట్టిన జైశ్రీరామ్ తోనే ఆ పని స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ పాట ప్రోమో వచ్చి అందర్నీ మెప్పించింది. తాజాగా నేడు ఈ జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ముంబైలో లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చి ఈవెంట్ నిర్వహించి పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు అజయ్ అతుల్ సంగీతం వహించారు. ఈ లిరికల్ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus