పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’. కృతి సనన్ హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ మూవీని ‘టి సిరీస్ ఫిలిమ్స్’ ‘రిట్రోఫిల్స్ బ్యానర్ల పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ జూన్ 16 న ఈ చిత్రం హిందీ, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదలయ్యింది.
హిందీలో ప్రభాస్ నటించిన స్ట్రైట్ మూవీ ఇది. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం చాలా బాగా నమోదయ్యాయి.ఫస్ట్ వీకెండ్ ఈ మూవీ చాలా బాగా కలెక్ట్ చేసింది.కానీ సోమవారం నుండీ కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
33.89 cr
సీడెడ్
8.89 cr
ఉత్తరాంధ్ర
9.48 cr
ఈస్ట్
5.55 cr
వెస్ట్
3.91 cr
గుంటూరు
6.32 cr
కృష్ణా
4.79 cr
నెల్లూరు
2.06 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
74.89 cr
హిందీ
63.66 cr
తమిళ్
2.22 cr
కర్ణాటక
11.08 cr
కేరళ
0.78 cr
ఓవర్సీస్
23.05 cr
వరల్డ్ వైడ్ (టోటల్ )
175.68 cr
‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రానికి రూ.228.9 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.230 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ 6 రోజులు పూర్తయ్యేసరికి రూ.175.68 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.54.32 కోట్ల షేర్ ను రాబట్టాలి.
అది కూడా చిన్న టార్గెట్ అయితే కాదు. వీకెండ్ ముగిసే వరకు ఇలాగే కలెక్ట్ చేసి.. రెండో వీకెండ్ కి మళ్ళీ గ్రోత్ చూపిస్తే.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ లు ఉంటాయి.