Adipurush: దేవుడా.. ఆదిపురుష్ హక్కులు ఏకంగా ఆ రేంజ్ లో అమ్ముడయ్యాయా?

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో 9 రోజుల సమయం మాత్రమే ఉంది. తిరుపతి ఈవెంట్ లో ఆదిపురుష్ మూవీ నుంచి మరో ట్రైలర్ రిలీజ్ కానుండగా ఈ ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిపురుష్ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు ఏకంగా 400 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం. ఒక భారీ బడ్జెట్ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు ఈ రేంజ్ లో అమ్ముడయ్యాయంటే ఒక విధంగా రికార్డ్ అనే చెప్పాలి.

ప్రభాస్ కు ఉన్న క్రేజ్ వల్లే ఈ స్థాయిలో హక్కులు అమ్ముడయ్యాయని సమాచారం. మైథలాజికల్ సినిమాలకు ఓటీటీలలో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఏ ఓటీటీ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిందనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. ఆదిపురుష్ సినిమాలో కృతిసనన్ సీత పాత్రలో నటించారు. ఆదిపురుష్ మూవీ టీజర్ విడుదలైన సమయంలో ఎన్నో నెగిటివ్ కామెంట్లు వినిపించగా ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ పరిస్థితి మారిపోయింది.

ఆదిపురుష్ మూవీ ఏకంగా 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా రికార్డ్ స్థాయి థియేటర్లలో విడుదల కానుంది. ఆదిపురుష్ మైథలాజికల్ సినిమాలలో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ కు గత రెండు సినిమాలు చేదు ఫలితాలను మిగిల్చి భారీ షాకులిచ్చాయి.

అయితే ఆదిపురుష్ (Adipurush) విషయంలో మాత్రం అలా జరగదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆదిపురుష్ మూవీ కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. ఆదిపురుష్ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus