Adipurush: ‘ఆదిపురుష్’ కి రూ.600 కోట్ల బడ్జెట్ పెట్టలేదా? మరి ఎంత పెట్టారు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ‘ఆదిపురుష్’ కూడా ఒక్కటన్న సంగతి తెలిసిందే. ‘తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకుడు. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ లు కలిసి ‘టి.సిరీస్ ఫిలిమ్స్’ ‘రెట్రోఫిల్స్’ బ్యానర్ల పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో సీత అలియాస్ జానకిగా కృతిసనన్ నటిస్తుంది.

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ .. రావణుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం చాలా వరకు బాలీవుడ్ జనాలను దృష్టిలో పెట్టుకుని తీసింది కాబట్టి.. ఎక్కువగా బాలీవుడ్ నటీనటులే ఉన్నారు. జూన్ 16 న ఈ చిత్రం ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. హిందీ, తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఈ మూవీ ఏకకాలంలో విడుదల కాబోతోంది.

ఇప్పటి జనరేషన్ కు ‘రామాయణం’ ని అర్థమయ్యేలా.. అందులోని మోరల్స్ ను పాటించేలా చెప్పాలని మేకర్స్ అనుకున్నారు. అందుకు వి.ఎఫ్.ఎక్స్ ను సాధనంగా వాడుకున్నారు. అవి రాజమౌళి సినిమాల్లో ఉండే రేంజ్లో లేకపోయినా.. జస్ట్ ఓకే అనిపించే విధంగా ఉన్నాయి. అయితే ఈ చిత్రం కోసం ఏకంగా రూ.600 కోట్ల బడ్జెట్ పెట్టారని చాలా కాలం నుండి ప్రచారం జరుగుతుంది. అందులో వి.ఎఫ్.ఎక్స్ కోసమే రూ.350 కోట్లు ఖర్చు చేసారని అంతా అంటున్న మాట.

అయితే ఇందులో నిజం లేదు అన్నది ఇన్సైడ్ టాక్. (Adipurush) ‘ఆదిపురుష్’ ను చాలా వరకు గ్రీన్ మ్యాట్లు వేసి తీసేసారు. చాలా వరకు వి.ఎఫ్.ఎక్స్ పైనే ఆధారపడ్డారు. ఓవరాల్ గా ఈ మూవీ రూ.380 కోట్ల బడ్జెట్లోనే ఫినిష్ చేశారని తెలుస్తుంది. కానీ పైకి మాత్రం రూ.600 కోట్లని చెబుతున్నారు. మన తెలుగు మేకర్స్ ఇంత బడ్జెట్ పెట్టలేరు అని చెప్పడానికి బాలీవుడ్ డప్పు కొట్టుకుంటుంది అని ఇన్సైడ్ సిర్కిల్స్ చెబుతున్న మాట.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus