Adipurush: ఓవర్సీస్ లో ఆదిపురుష్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ అలా ఉన్నాయా?

కేవలం నెల రోజుల్లో ఆదిపురుష్ సినిమాపై ప్రేక్షకుల్లో నెలకొని ఉన్న అభిప్రాయం పూర్తిస్థాయిలో మారిపోయింది. దాదాపుగా 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ ఫుల్ రన్ లో నిర్మాతలకు మంచి లాభాలను అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే యూఎస్ లో ఆదిపురుష్ సినిమాకు అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయని సమాచారం అందుతోంది.
ఈ సినిమాకు అక్కడి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని సమాచారం అందుతోంది.

త్వరలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆదిపురుష్ బుకింగ్స్ మొదలుకానున్నాయి. ఆదిపురుష్ తెలుగు వెర్షన్ హక్కులు 125 కోట్ల రూపాయలకు యూవీ క్రియేషన్స్ సొంతం చేసుకుందని సమాచారం. ఈ సినిమా హక్కులకు ఇతర ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడిందని సమాచారం అందుతోంది. ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలకు మంచి డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఆదిపురుష్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమా (Adipurush) సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటే రాబోయే రోజుల్లో మరిన్ని మైథలాజికల్ సినిమాలు తెరకెక్కే ఛాన్స్ ఉంది. ఆదిపురుష్ మూవీ మైథలాజికల్ సినిమాల భవిష్యత్తును డిసైడ్ చేసే మూవీ అవుతుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఆదిపురుష్ ప్రభాస్ ఫ్లాపులకు బ్రేక్ వేయడంతో పాటు కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాగా ఈ సినిమా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

దర్శకుడు ఓం రౌత్ కెరీర్ ను కూడా ఒక విధంగా ఈ సినిమా డిసైడ్ చేయనుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో పని చేయడానికి ఆసక్తి చూపే ఛాన్స్ ఉంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus