ప్రభాస్ ఆదిపురుష్ మూవీని మొదట 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే ఆ తర్వాత ఈ సినిమా బడ్జెట్ 500 కోట్ల రూపాయలకు చేరింది. అయితే ఆ రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కినా ఈ సినిమా టీజర్ గ్రాఫిక్స్ విషయంలో విమర్శలు వచ్చాయి. టీజర్ పై నెగిటివ్ కామెంట్లు వినిపించడంతో మేకర్స్ మరో 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ సినిమా గ్రాఫిక్స్ కు సంబంధించి కీలక మార్పులు చేశారు.
గ్రాఫిక్స్ బడ్జెట్ పెరగడంతో ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 600 కోట్ల రూపాయలకు పెరగడం గమనార్హం. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయని బోగట్టా. ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు ఇతర భాషల్లో కూడా భారీ స్థాయిలోనే డిమాండ్ ఉందని సమాచారం అందుతోంది. ఆదిపురుష్ తెలుగు వెర్షన్ హక్కుల టార్గెట్ 150 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.
ప్రభాస్ కు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఈ సినిమాకు 150 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరగడం సులువు కాదు. ఆదిపురుష్ మూవీకి ప్రముఖ టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది. ప్రభాస్ క్రేజ్ పెరుగుతుండగా ఈ సినిమాతో ప్రభాస్ కోరుకున్న సక్సెస్ దక్కుతుందని అభిమానులు ఫీలవుతున్నారు.
ఆదిపురుష్ (Adipurush) మూవీకి సంబంధించి ప్రమోషన్స్ లో వేగం పెంచితే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా రిలీజ్ కు నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రభాస్ త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలలో పాల్గొంటారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆదిపురుష్ ట్రైలర్ హిందీ వెర్షన్ కు 50 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆదిపురుష్ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటే సలార్, ప్రాజెక్ట్ కే సక్సెస్ సాధిస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?