Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ట్రైలర్.. టీజర్ కంటే బెటర్.!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’. ‘టి సిరీస్’ ‘రెట్రో ఫిల్స్’ బ్యానర్లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతర్,రాజేష్ నాయర్..లు కలిసి రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.రామాయణంలోని ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని… ఏ ఫిలిం మేకర్ కూడా టచ్ చేయని పాయింట్ ను ఈ మూవీలో చూపించబోతున్నట్టు టీం చెప్పుకొచ్చింది.

సైఫ్ అలీ ఖాన్ లంకేశ్(రావణుడు) పాత్రలో నటిస్తుండగా సీతగా కృతి సనన్ నటిస్తుంది. ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ అయ్యింది. అది యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కొద్దిసేపటి క్రితం ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ 3 నిమిషాల 19 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘ఇది నా రాముడి కథ. ఆయన మనిషిగా పుట్టి భగవంతుడు అయిన మహనీయుడు. ఆయన జీవితం ధర్మానికి సన్మార్గానికి నిదర్శనం..

ఆయన నామం రాఘవ’ అంటూ సాగే వాయిస్ ఓవర్లో ట్రైలర్ మొదలైంది. ఇందులో చాలా వరకు అందరికీ తెలిసిన థీమ్ నే చూపించారు. ‘నా ప్రాణమే జానకిలో ఉంది.. కానీ నా ప్రాణాల కన్నా మర్యాదే అధిక ప్రియమైనది’ ‘మనం జన్మతో కాదు చేసే కర్మతో చిన్న పెద్ద అవుతాం.’ వంటి డైలాగులు బాగున్నాయి. ‘రాఘవ్ నన్ను పొందడానికి శివధనస్సును విరిచారు.. ఇప్పుడు రావణుడి గర్వాన్ని విరిచేయాలి’ అనే డైలాగ్ ట్రైలర్ కు మంచి హై ఇచ్చిందని చెప్పొచ్చు.

(Adipurush) ఈ సినిమాలో విజువల్స్ అంత గొప్పగా ఉండవు అని టీజర్ తో అంతా ఫిక్స్ అయిపోయారు. ట్రైలర్ మరోసారి ఆ విషయాన్ని గుర్తు చేసింది. విజువల్స్ అంత గొప్పగా లేవు. ప్రభాస్, కృతి అందంగా కనిపించారు. కానీ ప్రభాస్ కు మీసాలు లేకుండా ఉంటే ఇంకా బాగుండేదేమో. అజయ్ – అతుల్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus