Adipurush: కేవలం రెండు గంటలల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయో.. ఇది ఎవరికీ సాధ్యం కాదేమో!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆదిపురుష్’ విడుదల తేదీ సమీపిస్తోంది. మూవీ టీం కూడా టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రొమోషన్స్ దద్దరిల్లిపోయేలా చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. జూన్ 6 వ తారీఖున హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగబోతుంది. ఇక ఈ చిత్రం నుండి విడుదల అవుతున్న ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుండి ఊహించని రెస్పాన్స్ వస్తుంది.

ఇప్పటికే ‘జై శ్రీ రామ్’ లిరికల్ వీడియో సాంగ్ భారత దేశాన్ని ఊపేస్తోంది. ఎక్కడ చూసిన ఈ పాటనే ఇప్పుడు. అదే ఊపు లో గత కొద్దీ రోజుల క్రితమే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కి కూడా రెస్పాన్స్ మామూలు రేంజ్ లో రాలేదు.ఇలా ఊహకందని రేంజ్ లో రోజు రోజుకి అంచనాలను పెంచుకుంటూ పోతున్న ఈ సినిమా నుండి మొన్ననే ‘రామ్ సీత రామ్’ వీడియో సాంగ్ విడుదల అయ్యింది.

ఈ పాటకి ఆడియన్స్ నుండి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం రెండు రోజుల్లోనే హిందీ లో 36 మిలియన్ కి పైగా వ్యూస్, తెలుగు లో 7.6 మిలియన్ వ్యూస్, తమిళం లో 1.6 మిలియన్ వ్యూస్, కన్నడ లో 1 మిలియన్ వ్యూస్ మరియు మలయాళం లో కూడా 1 మిలియన్ వ్యూస్ ని రప్పించుకుంది. మొత్తం మీద అన్నీ భాషలకు కలిపి కేవలం రెండు రోజుల్లో 48 మిలియన్ వ్యూస్ రప్పించుకుందట ఈ సాంగ్.

ఇది ప్రపంచ రికార్డు అని చెప్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పటి వరకు ఒక పాటకి ఈ తక్కువ సమయం లో ఈ స్థాయి వ్యూస్ ఎప్పుడూ రాలేదని చెప్తున్నారు. అలా ఇప్పటి వరకు ఆదిపురుష్ నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం అద్భుతంగా ఉంది, సినిమా (Adipurush) కూడా అదే రేంజ్ లో ఉంటుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus