Adipurush: నార్త్ లో ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘ఆదిపురుష్’ ట్రైలర్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ చిత్రం ట్రైలర్ నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. యూట్యూబ్ లో ఈ మూవీ ట్రైలర్ రికార్డులు సృష్టిస్తుంది. 24 గంటల్లో ‘ఆదిపురుష్’ ట్రైలర్ 70 మిలియన్ వ్యూస్ ను నమోదు చేసి ఆల్ టైం రికార్డులు సృష్టించింది. తెలుగు ట్రైలర్ అయితే 13 .79 మిలియన్ వ్యూస్ ను నమోదు చేయగా, హిందీ ట్రైలర్ 52 .22 మిలియన్ వ్యూస్ ను నమోదు చేసింది.

తమిళ ట్రైలర్ 3 .13 మిలియన్ వ్యూస్ ను, మలయాళం ట్రైలర్ 3 .12 మిలియన్ వ్యూస్ ను నమోదు చేసింది. ఇక కన్నడ ట్రైలర్ అయితే 1 .76 మిలియన్ వ్యూస్ ను నమోదు చేసింది. మొత్తంగా 70 కి పైగా మిలియన్ వ్యూస్ ను నమోదు చేసింది ‘ఆదిపురుష్’ ట్రైలర్.ఇదిలా ఉండగా.. హిందీలో అయితే ‘ఆదిపురుష్’ ట్రైలర్ 24 గంటల్లో 52 .22 మిలియన్ వ్యూస్ ను నమోదు చేసి ఆల్ టైం రికార్డులు సృష్టించింది.

హిందీలో అత్యధిక వ్యూస్ ను నమోదు చేసిన ట్రైలర్ గా ‘ఆదిపురుష్’ నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. అంతకు ముందు ‘తు జుతి మెయిన్ మక్కర్’ ట్రైలర్ నెంబర్ 1 ప్లేస్ లో ఉండేది.ఈ చిత్రం ట్రైలర్.. 51 మిలియన్ వ్యూస్ ను నమోదు చేసింది.దానికి ముందు ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ‘ నెంబర్ 1 ప్లేస్ లో ఉండేది. దీనిని బట్టి ‘ఆదిపురుష్’ చిత్రానికి నార్త్ లో మంచి డిమాండ్ ఉందని స్పష్టమవుతుంది.

‘ఆదిపురుష్’ (Adipurush) ను డైరెక్ట్ చేసింది బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కావడం.. అలాగే ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్ వంటి స్టార్లతో పాటు.. ఇందులో ఉన్న నటీనటులంతా బాలీవుడ్ వాళ్ళే కావడంతో అక్కడ ‘ఆదిపురుష్’ కు మంచి డిమాండ్ ఏర్పడిందని స్పష్టమవుతుంది. అంతేకాకుండా అక్కడ డివోషనల్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus