Adireddy, Shrihan: శ్రీహాన్ తీసుకున్న డబ్బుల వెనుక ఇంత కథ ఉందా?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్6 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో శ్రీహాన్ 40లక్షల రూపాయలు తీసుకోవడం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీహాన్ డబ్బులు తీసుకుంటే ఆడియన్స్ అతనిని విన్నర్ గా చూడాలని వేసిన ఓట్లకు అర్థం ఏముంటుందని కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి మాట్లాడుతూ శ్రీహాన్ డబ్బులు తీసుకోవడం వెనుక గల కారణాలను చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఎంత మొత్తం ఆఫర్ చేసినా ఆ మొత్తం తీసుకోవడానికి తాను ఆసక్తి చూపేవాడిని కాదని ఆదిరెడ్డి కామెంట్లు చేశారు.

బిగ్ బాస్ హౌస్ లో ఆఫర్ చేసిన డబ్బులు తీసుకోవడం వల్ల విన్నర్ ఊహించని స్థాయిలో నష్టపోతాడని ఆదిరెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే తాను డబ్బులు తీసుకోకపోయినా తన దృష్టిలో శ్రీహాన్ డబ్బులు తీసుకోవడం కరెక్టేనని ఆదిరెడ్డి కామెంట్లు చేశారు. శ్రీహాన్ రెండో స్థానానికి రావడానికి ఎంతో కష్టపడ్డారని ఆయన పేర్కొన్నారు. శ్రీహాన్ వ్యక్తిగత జీవితంలో ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నాయని అందువల్ల శ్రీహాన్ డబ్బులు తీసుకోవడానికి ఓకే చెప్పారని ఆదిరెడ్డి తెలిపారు.

చాలామంది శ్రీహాన్ డబ్బులు తీసుకోవడంపై విమర్శలు చేస్తున్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఎవరైనా అదే పని చేసేవారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. బిగ్ బాస్ షోలో ఎన్నో రాజకీయాలు జరుగుతాయని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. నాగార్జున అధికారికంగా కూడా శ్రీహాన్ ను విన్నర్ గా ప్రకటించేవారని శ్రీహాన్ తన డబ్బునే తాను తీసుకున్నాడని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

రన్నర్ గా నిలిచిన శ్రీహాన్ విషయంలో ప్రేక్షకుల్లో భిన్నభిప్రాయాలు ఉండటం గమనార్హం. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ గా బాలయ్య, రానా పేర్లు వినిపిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus