Adivi Sesh: నన్ను మోసం చేశారు.. ఆ కోపంతో ‘సొంతం’ మూవీ చూడలేదు: అడివి శేష్

శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన మూడో చిత్రం ‘సొంతం’. ‘నీకోసం’ ‘ఆనందం’ వంటి చిత్రాల తర్వాత శ్రీను వైట్ల తెరకెక్కించిన మూవీ ఇది. 2002 ఆగస్ట్ 23న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని మాత్రమే అందుకుంది. కానీ ఇప్పటికీ ప్రేక్షకులను ఈ మూవీ ఆకట్టుకుంటూనే ఉందని చెప్పాలి. ఈ సినిమాలో సునీల్ కామెడీ ట్రాక్ ఇష్టపడని వారంటూ ఉండరు. ఈ సినిమాలో సునీల్ పాత్రను దర్శకుడు శ్రీను వైట్ల బాగా డిజైన్ చేశాడు. సినిమాలో ఈ పాత్ర దాదాపు 45 నిమిషాల నుండీ గంట వరకు ఉంటుంది. ఇప్పటికీ యూట్యూబ్లో ఈ కామెడీ సీన్స్ ను చూసి చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు.

కానీ దర్శకుడు శ్రీను వైట్ల.. ఈ పాత్ర మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాడు.. మిగిలిన కథ గాలికి వదిలేశాడు అనే ఫీలింగ్ అప్పట్లో జనాలకు కలిగింది. లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ ఏమాత్రం మెప్పించవు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ‘సొంతం’ మూవీ చూడని ప్రేక్షకులు ఎక్కువ మంది ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. బుల్లితెర పై టెలికాస్ట్ అయినా సరే ఈ మూవీని కథలకుండా చూసే బ్యాచ్ ఉన్నారు. కానీ హీరో అడివి శేష్ మాత్రం ఈ సినిమాని ఇప్పటివరకు చూడలేదట. అందుకు కారణం కూడా ఉంది.

ఈ మూవీలో అడివి శేష్ కూడా చిన్న పాత్ర పోషించాడు. బహుశా ఈ విషయం ఎక్కువమందికి తెలిసుండదు. సినిమా క్లైమాక్స్ లో నమితని పెళ్లి చేసుకోవడానికి వచ్చే పెళ్లి కొడుకు ఇతనే. నిజానికి శ్రీను వైట్ల.. ఈ పాత్ర గురించి శేష్ కు చెప్పేటప్పుడు సెకండ్ హీరో పాత్ర లాంటిది ఇది అని చెప్పాడట. కానీ 3 రోజులకే షూటింగ్ అయిపోయింది అని చెప్పడంతో షాక్ అయ్యాడట.తీరా సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే అది చాలా చిన్న పాత్ర అని తెలిసి హర్ట్ అయ్యాడట. ఆ కోపంతో ఇప్పటివరకు శేష్ ‘సొంతం’ సినిమా చూడలేదట. శ్రీను వైట్ల ఫేడౌట్ అయిపోయిన డైరెక్టర్ కాబట్టి… మనోడు ఫామ్లో ఉన్న హీరో కాబట్టి.. ఈ విషయాన్ని ఇంత ఓపెన్ గా చెప్పాడు. అదే స్టార్ హీరో అయితే చెప్పేవాడా?

 

మంజిమా మోహన్ స్పందన నేపథ్యంలో ఇకనైనా ట్రోల్స్ ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది. మంజిమా మోహన్ కు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఆమె మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus