Adivi Sesh, Pawan Kalyan: అదే నన్ను ఇండస్ట్రీలో నిలబెడుతుందన్న అడివి శేష్!

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన అడివి శేష్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. మేజర్ సినిమాతో అడివి శేష్ ఇతర భాషల ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని చాలామంది హీరోలతో అడివి శేష్ కు మంచి అనుబంధం ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అడివి శేష్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నేను ఇక్కడే పుట్టానని అమెరికాలో పెరిగానని శేష్ తెలిపారు.

తెలుగు నేలను, తెలుగు భాషను నేను మరిచిపోలేదని శేష్ కామెంట్లు చేశారు. మా నాన్నకు సినిమాల్లోకి రావాలని ఉన్నా కాలం సహకరించలేదని హీరో కావాలనే ఆసక్తితో నేను కర్మ అనే సినిమాలో నటించానని అడివి శేష్ అన్నారు. కర్మ తెలుగులో ఫ్లాపైనా స్పానిష్ అనువాద హక్కుల ద్వారా 60 శాతం డబ్బులను తిరిగి పొందానని అడివి శేష్ చెప్పుకొచ్చారు. తాను బాలీవుడ్ ఆర్టిస్ట్ లా ఉండటంతో విలన్ పాత్రలు చేయాలని దిల్ రాజు సూచించారని కెరీర్ తొలినాళ్లలో తాను అందుకే ఆ తరహా పాత్రల్లో నటించానని అడివి శేష్ చెప్పుకొచ్చారు.

నేను హిందీ ఆర్టిస్ట్ అనుకొని పవన్ నాతో హిందీలో మాట్లాడేవారని నేను తెలుగువాడినని చెప్పడంతో పవన్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని అడివి శేష్ తెలిపారు. ఫారిన్ లో ఉన్న సమయంలో పంజాబీ అమ్మాయిని ప్రేమించానని అడివి శేష్ అన్నారు. నా బర్త్ డే రోజున ఆమె పెళ్లి జరిగిందని అడివి శేష్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పెళ్లిపై నాకు ఆసక్తి పోయిందని అడివి శేష్ కామెంట్లు చేశారు.

నా ప్రవర్తనే నన్ను ఇండస్ట్రీలో నిలబెడుతుందని అడివి శేష్ చెప్పుకొచ్చారు. వివాదాలకు దూరంగా ఉండే నటుడిగా అడివి శేష్ కు పేరుంది. అడివి శేష్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus