Adivi Sesh, Allu Arjun: అల్లు అర్జున్ గురించి అడివి శేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

‘క్షణం’ ‘గూఢచారి’ ‘ఎవరు’ ‘మేజర్’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న అడివి శేష్ హీరోగా రూపొందుతున్న మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘హిట్ 2’. 2020 లో వచ్చిన ‘హిట్’ సినిమా మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. దీని ఫ్రాంచైజీ లో రాబోతున్న చిత్రమే ఈ ‘హిట్ 2’ ‘ది సెకండ్ కేస్’ .ఈ మూవీ డిసెంబర్ 2న విడుదల కాబోతుంది. ప్రమోషన్లలో భాగంగా ఈరోజు టీజర్ ను లాంచ్ చేశారు. ఈ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా, థ్రిల్లింగ్ సాగడంతో పాటు కొంత భయపెట్టింది అని కూడా చెప్పొచ్చు.

ఈ చిత్రంలో కోమలి ప్రసాద్, మీనాక్షి చౌదరి వంటి కథానాయికలు కీలక పాత్రలు పోషించారు. ఇక టీజర్ లాంచ్ లో అడివి శేష్ మాట్లాడుతూ అల్లు అర్జున్ గురించి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. అడివి శేష్ మాట్లాడుతూ.. “చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తోంది. నా జర్నీ గురించి ఆలోచిస్తున్నాను. హీరోలందరికీ నచ్చే హీరో నేను. ‘క్షణం’ కు ఎవరు సపోర్ట్ చేయనప్పుడు బన్నీ పెద్ద లెటర్ రాసి బ్యూటీఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మహేష్ సార్ నా క్షణం టీజర్ రిలీజ్ చేయడమే కాదు.. నాతో ‘మేజర్’ సినిమా చేసి పాన్ ఇండియా రేంజ్‌కి తీసుకెళ్లారు.

చాలా హ్యాపీగా అనిపించింది. నా ఫేవరేట్ హీరో నాని. ‘గూఢచారి’, ‘ఎవరు’ సినిమాల ట్రైలర్స్‌ని తనే లాంఛ్ చేశారు. ఓరోజు సడెన్‌గా వచ్చి ట్రైలర్స్ లాంచ్ చేయటం కాదు..ఓ హిట్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తానని అన్నారు. ‘హిట్ 2’ సినిమా అలా లైన్‌కి వచ్చింది. మంచి సినిమా చేయాలనే తపన ఎప్పుడూ ఉంటుంది. కోవిడ్ సమయంలో ‘హిట్ 2’ సినిమా చేయడానికి టీమ్ ఎంతో కష్టపడింది. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. సినిమా చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తారు. టీజర్ చూడగానే విలన్ వాయిస్ బాగా నచ్చింది.

హిట్ వెర్సెలో డిఫరెంట్ విజన్స్ ఉన్నాయి. అందుకే హిట్ 2లో నేను యాక్ట్ చేశాను. హిట్ 1 క్వశ్చన్స్‌తో థ్రిల్ చేస్తే.. హిట్ 2 భయపెట్టి థ్రిల్ చేస్తుంది. శైలేష్ నన్ను కొత్తగా చూపించాడు. మంచి నటీనటులతో పని చేశాను. గ్యారీ ఈ సినిమాకు ఎడిటర్‌గా వర్క్ చేశారు. తను త్వరలోనే నిఖిల్ స్పైతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. మణికందన్.. ఫెంటాస్టిక్ టెక్నీషియన్. మీనాక్షి చౌదరి టాలెంటెడ్ ఆర్టిస్ట్. నేచురల్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. హిట్ 2 డిసెంబర్ 2న రానుంది. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. థియేటర్స్‌లో కలుద్దాం’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Ashu Reddy Stylish Clicks In Paris

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus