తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒక టైమ్ లో అందం, డాన్సులు, స్క్రీన్ ప్రెజెన్స్ అంటే ముందు గుర్తుకు వచ్చేది రవీనా టాండన్. బంగారు బుల్లోడు, ఆకాశ వీధిలో వంటి సినిమాలతో నాగార్జున, బాలకృష్ణ సరసన తన మ్యాజిక్ చూపించి టాలీవుడ్‌లో సూపర్ ఫ్యాన్‌బేస్ సంపాదించుకుంది. అందం, అభినయం – అన్నీ కలగలసిన ఈ బ్యూటీ అప్పట్లో అభిమానులలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
అదే సమయంలో హిందీలో వరుస ఆఫర్లు రావడంతో అక్కడే ఫుల్ టైమ్ సెటిల్ అయింది. 2014లో మోహన్ బాబు సరసన పాండవులు పాండవులు తుమ్మెద తర్వాత కొంత గ్యాప్ తీసుకుని, ఆ తరువాత KGF-2లో రమికా సేన్ పాత్రతో దుమ్ము దులిపింది. పవర్‌ఫుల్ రోల్‌తో తన కెరీర్‌కి మళ్లీ స్పార్క్ ఇచ్చింది.
భారీ రీఎంట్రీ — సూర్య 46 తో….
ఇక తాజాగా, రవీనా టాండన్ దాదాపు పదేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా అడుగు పెట్టబోతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ సూర్య 46లో ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నారు. స్ట్రాంగ్ ఎమోషన్స్, పవర్ క్యారెక్టర్లు, భారీ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ మూవీ ఇప్పటికే హైప్ క్రియేట్ చేసింది.

ఇందులో ప్రేమలు ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. రవీనా పాత్ర స్టోరీలో మెయిన్ టర్నింగ్ పాయింట్‌గా ఉంటుందని టాక్.
రీ-ఎంట్రీ తో ఫ్యాన్స్‌లో ఉత్సాహం….
రవీనా రీఎంట్రీ న్యూస్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌లో ఎక్సయిట్మెంట్ నెలకొంది. మళ్లీ ఆ మేజిక్ చూడబోతున్నామా?, క్లాసిక్ స్టార్ ఫైర్ మళ్లీ స్క్రీన్‌పై అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

చివరగా….
ఒకప్పుడు టాలీవుడ్ సిల్వర్‌స్క్రీన్‌ను తన మ్యాజిక్ తో మెస్మరైజ్ చేసిన రవీనా టాండన్… ఇప్పుడు మళ్లీ రాబోతుంది.
మళ్లీ రవీనా తన మార్క్ చూపిస్తుందా? చూడాలి మరి…
