Trivikram: లాలా భీమ్లా గురూజీ ఫ్యాన్స్‌ చాలా స్పెషల్‌… ఎందుకంటే?

త్రివిక్రమ్‌ అంటే మాటల మాంత్రికుడు అని, అద్భుతమైన దర్శకుడు మాత్రమే కాదు. ఆయనలో చక్కటి గేయ రచయిత కూడా ఉన్నారు. ఇది ఇప్పుడు కాదు చాలా ఏళ్ల క్రితమే టాలీవుడ్‌కి తెలిసింది. ఇప్పుడెందుకు చెబుతున్నారు ఈ విషయం అనుకోవచ్చు. కారణం ఉంది. ‘భీమ్లా నాయక్‌’ సినిమాలోపి ‘లాలా భీమ్లా…’పాటను గురూజీనే రాశారనే విషయం మీకు తెలిసిందే. ఆయన పాట కోసం పెన్ను పట్టుకొని 18 ఏళ్లు అయ్యిందని తెలుసా? త్రివిక్రమ్‌ మాటల రచయితగా కొనసాగుతున్న తొలి రోజుల్లో అంటే 18 ఏళ్ల క్రితం ఓ సినిమా కోసం పాటలు రాశారు.

‘ఒక రాజు ఒక రాణి’ సినిమా కోసం ఆయన తొలిసారి పాట రాశారు. యోగి దర్శకత్వం వహించిన ఆ సినిమాలో రవితేజ, నమిత జంటగా నటించారు. ఆ సినిమాలో పాటలకు మంచి పేరే వచ్చింది. కానీ ఆ తర్వాత త్రివిక్రమ్‌ మళ్లీ పాట కోసం పెన్ను పట్టలేదు. ఎట్టకేలకు ‘భీమ్లా నాయక్‌’ కోసం తిరిగి గీత కలం పట్టారు. ‘అయ్యప్పనుమ్‌ కొశియమ్‌’ కోసం త్రివిక్రమ్‌ స్క్రీన్‌ ప్లే, సంభాషణలు అందిస్తున్నారని చాలా రోజుల క్రితమే చెప్పారు.

అయితే ఇప్పుడు ఆ సినిమా కోసం పాట కూడా రాశారు. తన స్నేహితుడు పవన్‌ కల్యాణ్‌ కోసమే త్రివిక్రమ్‌ ఈ పని చేశారని అంటున్నారు. హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసే మాటలు రాయడం, సినిమాలు తీయడంతో త్రివిక్రమ్‌ దిట్ట అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు పాట రచించడంలోనూ తన మార్కు చూపించారు. తొలి సినిమాలో ప్రేమ పాటలే రాశారు కదా మరి.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus