నటసింహ నందమూరి బాలకృష్ణ.. నటరత్న ఎన్టీఆర్ నట వారసుడిగా ‘తాతమ్మకల’ చిత్రంతో బాల నటుడిగా ప్రవేశించిన బాలయ్య.. తండ్రితో కలిసి పలు సినిమాల్లో నటించి.. ‘మంగమ్మ గారి మనవడు’ తో సోలో స్టార్ హీరోగా సత్తా చాటాడు.. రామారావు, నాగేశ్వర రావు తర్వాత జనరేషన్‌లో జానపద, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలు చెయ్యాలంటే తనకు మాత్రమే సాధ్యం అనేంతగా అలరించాడు..
‘మువ్వగోపాలుడు’, ‘ముద్దుల మావయ్య’, ‘లారీ డ్రైవర్’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’, ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’, ‘బొబ్బిలి సింహం’, ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’, ‘సింహా’, ‘లెజెండ్’, గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’.. ఇలా చెప్పుకుంటూ పోతే.. తన నట విశ్వరూపంతో ఉగ్ర నరసింహుడిలా చెలరేగిపోయి చరిత్రలో నిలిచిపోయే విజయాలు సాధించాడు నటసింహ.. 2004 సంక్రాంతికి ‘లక్ష్మీ నరసింహ’ తో సూపర్ హిట్ కొట్టిన తర్వాత ఆ ఏడాది డిసెంబర్ నుండి 2010 ఏప్రిల్ 30న ‘సింహా’ వచ్చే వరకు సరైన సినిమా పడలేదు..
వరుస ఫ్లాపులు, వాటిలో కొన్ని ఊహించని ఘోర పరాజయాలు.. ఇక బాలకృష్ణ పని అయిపోయింది అనుకున్నారు.. అప్పుడు ‘సింహా’ గా జూలు విదిలించాడు.. 80ల కాలంలో ఒకే ఏడాది వరుసగా ఆరు సూపర్ హిట్స్ కొట్టిన ట్రాక్ రికార్డ్, ఇండస్ట్రీ రికార్డ్స్ ఆయన పేరిట ఉన్నాయి.. తర్వాత వరుసగా రెండు హిట్స్ ఇచ్చినా కానీ.. మూడోది ఫ్లాప్ అవడం వల్ల హ్యాట్రిక్‌కి కూత వేటు దూరంలో ఆగిపోయాడు బాలయ్య..
కట్ చేస్తే.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత.. 30 సంవత్సరాల క్రితం జరిగిన మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నాడంటూ.. ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.. 2021 డిసెంబర్ 2న ‘అఖండ’ గా సెన్షేసన్ క్రియేట్ చేసిన బాలయ్య.. ఈ సంక్రాంతికి ‘వీర సింహా రెడ్డి’ గా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుని.. ఇప్పుడు తన 108వ సినిమాని అనిల్ రావిపూడితో చేస్తున్నాడు.. రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కాంబినేషన్‌లో వస్తున్న NBK 108 కూడా తప్పకుండా విజయం సాధించి, ముప్ఫై ఏళ్ల నాటి బాలయ్యను గుర్తు చేస్తుంది అంటున్నారు ఫ్యాన్స్.