తెలుగులో సూపర్ హిట్ సాధించిన పాత సినిమాల టైటిల్స్ ను కొత్త సినిమాలకు పెడితే ఫ్లాప్ అవుతాయి అనేది ఒక నానుడి. అందుకు నిదర్శనం “మాయాబజార్, దేవదాసు” చిత్రాలు. అప్పట్లో క్లాసిక్ హిట్స్ గా నిలిచిన ఈ చిత్రాల టైటిల్స్ ను ఇప్పటి సినిమాలకు పెడితే పెద్దగా అచ్చిరాలేదు. అలాగే.. చిరంజీవి సూపర్ హిట్ సినిమాల టైటిల్స్ ను ప్రెజంట్ జనరేషన్ సినిమాలకు పెట్టడం కూడా పెద్దగా అచ్చిరాలేదు. ఆయన అల్లుడు నటించిన సినిమాకి “విజేత” అనే టైటిల్ పెడితేనే ఎవరూ పట్టించుకోలేదు.
అయితే.. చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన “రాక్షసుడు” టైటిల్ పెట్టుకొన్న బెల్లంకొండ మాత్రం హిట్ కొట్టగలిగాడు. ఇప్పుడు అందరి దృష్టి చిరంజీవి క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన “గ్యాంగ్ లీడర్”ను టైటిల్ గా పెట్టుకొన్న నాని సినిమాపై పడింది. మెగాస్టార్ “గ్యాంగ్ లీడర్” మాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయితే.. నాని “గ్యాంగ్ లీడర్” మాత్రం క్లాస్ రివెంజ్ డ్రామా. మరి బెల్లంకొండకు అచ్చోచిన మెగాస్టార్ సెంటిమెంట్.. నానికి ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.