మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇప్పుడున్న స్టార్ హీరోలలో ఒకరు. మెగాస్టార్ తనయుడుగా ‘చిరుత’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ మొదటి చిత్రంతోనే కమర్షియల్ హీరో అనే గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండో చిత్రం ‘మగథీర’ తో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. తరువాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన చరణ్.. ఇప్పుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. మరోపక్క ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించి తన తండ్రి చిరంజీవితో ‘ఖైది నెంబర్ 150’ ‘సైరా నరసింహారెడ్డి’ వంటి చిత్రాలు నిర్మించాడు.
ఇప్పుడు ‘ఆచార్య’ ను కూడా నిర్మిస్తున్నాడు. అంతేకాదు బిజినెస్ రంగంలో కూడా రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. అప్పట్లో నాగార్జున కూడా తన తండ్రితో ‘ప్రేమాభిషేకం’ ‘రావు గారి ఇల్లు’ ‘కలెక్టర్ గారి అబ్బాయి’ వంటి ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించాడు. అంతేకాదు నాగార్జున కూడా బిజినెస్ రంగంలో రాణిస్తున్నాడు. ఇలాగే దివంగత నందమూరి హరికృష్ణ కూడా తన తండ్రి ఎన్టీఆర్ తో సినిమాలు నిర్మించాడు కానీ.. అతను స్టార్ హీరో కాదు.
కాబట్టి రాంచరణ్, నాగార్జున మాత్రమే ఓ పక్క స్టార్ హీరోలుగా రాణిస్తుండగానే వారి తండ్రులతో సినిమాలు నిర్మించి రికార్డులు క్రియేట్ చేసారు. ఆ రికార్డుని ఇప్పట్లో ఎవ్వరూ బ్రేక్ చెయ్యలేరు అనే చెప్పాలి. బహుశా భవిష్యత్తులో సాధ్యం అవుతుందేమో చూడాలి.