హీరో, హీరోయిన్లు అన్న తర్వాత కొంత ఏజ్ గ్యాప్ ఉండడం సహజం. ఇద్దరి మధ్య ఐదేళ్ల గ్యాప్ అనేది సాధారణం. పదేళ్లు తేడా ఉన్న తెరపైన పర్ఫెక్ట్ పెయిర్ గానే కనిపిస్తారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఇరవై, ముప్పై ఏళ్ళ గ్యాప్ ఉన్నప్పటికీ చక్కని జంటగా పేరు తెచ్చుకున్న కొంతమంది హీరో హీరోయిన్లు ఉన్నారు. వారి నటన, కెమిస్ట్రీ తో వయసును మురిపించారు. అటువంటి జంటలపై ఫోకస్..
ఎన్టీఆర్ – శ్రీదేవి మహా నటుడు నందమూరి తారక రామారావు బడిపంతులు సినిమాలో శ్రీదేవి చిన్నపిల్లగా కనిపించింది. అప్పుడు ఆమె వయసు 9 ఏళ్ళు. ఆమెకి 16 ఏళ్ళు రాగానే హీరోయిన్ గా మారింది. వెంటనే ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం పట్టేసింది. ఎన్టీఆర్, శ్రీదేవి మధ్య 40 ఏళ్లు ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ వేటగాడు, గజదొంగ, సర్దార్ పాపా రాయుడు, కొండవీటి సింహం వంటి సినిమాలో వీరిద్దరూ పర్ఫెక్ట్ పెయిర్ గా అలరించారు.
ఎన్నార్ – శ్రీదేవిఎన్టీఆర్ కి పోటీ హీరో అయిన ఎన్నార్ తోను శ్రీదేవి రొమాన్స్ చేసింది. ప్రేమాభిషేకం’, ‘శ్రీరంగ నీతులు’, ‘ప్రేమ కానుక వంటి హిట్ చిత్రాల్లో శ్రీదేవి, నాగేశ్వరరావు చక్కని జంటగా పేరు తెచుకున్నారు. వీరిద్దరి మధ్య కూడా 40 ఏళ్ళ వయసు తేడా ఉంది.
కృష్ణ – ఇంద్రజ తొలితరం హీరోల్లో ఒకరైన కృష్ణ.. ఆనాటి హీరోయిన్లతో పాటు.. నేటి హీరోయిన్లతో కూడా ఆడిపాడారు. తన కంటే ముప్పై ఏళ్ళ చిన్నవారైనా సౌందర్య, ఆమనీలతో స్టెప్పులు వేసిన సూపర్ స్టార్ అమ్మదొంగా మూవీలో ఇంద్రజతో డ్యూయట్ చేశారు. కృష్ణ కంటే ఇంద్రజ 34 ఏళ్ళు చిన్నది అయినప్పటికీ, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ నచ్చి ప్రేక్షకులు సినిమాని హిట్ చేశారు.
వెంకటేష్ – జెనీలియాపరిశ్రమలోకి వచ్చి ముప్పైయేళ్లు దాటిపోతున్న విక్టరీ వెంకటేష్ గ్లామర్ కొంచెం కూడా తగ్గలేదు. అతని పక్కన ఎవరైనా బాగా సూట్ అవుతారు. బబ్లీ బ్యూటీ జెనీలియా వెంకటేష్ పక్కన సుభాష్ చంద్రబోస్ సినిమాలో కలిసి నటించింది. ఆమె కంటే వెంకటేష్ 27 ఏళ్ళు పెద్దవారైనప్పటికీ ఆ తేడా వారి మధ్య కనిపించలేదు.
బాలకృష్ణ – ఇషా చావ్లా బాలకృష్ణ హీరోగా అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయా కాలంలో కొత్తగా పరిశ్రమకు వచ్చిన నటీమణులతో కలిసి నటించారు. అయితే శ్రీమన్నారాయణ సినిమా బాలయ్య పక్కన నటించిన ఇద్దరు ముద్దుగుమ్మలు ఇషా చావ్లా, పార్వతి మెల్టన్ లు చాల తక్కువ వయసుకలవారు. బాలకృష్ణ, ఇషాచావ్లా మధ్య ఏజ్ గ్యాప్ 28 ఏళ్లు.
నాగార్జున – లావణ్య త్రిపాఠి టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ని ఎవరైనా చూసినప్పుడు అతని ఏజ్ పెరగడం ఏమైనా ఆగిపోయిందా అనిపిస్తుంది. నటనలో మాత్రమే కాకుండా అందంలోను కొడుకులకు గట్టి పోటీ ఇస్తున్నారు. అందుకు ఇతని పక్కన ఏ హీరోయిన్ నటించిన పర్ఫెక్ట్ పెయిర్ గా అనిపిస్తారు. రీసెంట్ గా వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనలో నటించిన లావణ్య త్రిపాఠి నాగార్జున కంటే 29 ఏళ్ళు చిన్నా. అయినా ఆ తేడా అసలు కనిపించలేదు.
చిరంజీవి – కాజల్ అగర్వాల్మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్లు గ్యాప్ తర్వాత చేసిన చిత్రం ఖైదీ నంబర్ 150 . అయితే ఇందులో హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ కి చిరు కి గ్యాప్ ఎంతో తెలుసా 30 . ఆశ్చర్యంగా ఉంది కదూ. సినిమాలో వారిద్దరూ హుషారుగా డ్యాన్సులు వేస్తుంటే ఏజ్ గ్యాప్ ప్రశ్న ఎవరికీ రాదు.
రజనీకాంత్ – అమీ జాక్సన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 2 .0 విజువల్ వండర్ మాత్రమే కాదు. అందులో నటిస్తున్న హీరో, హీరోయిన్స్ మధ్య ఏజ్ గ్యాప్ కూడా వండర్. రజనీకాంత్ కంటే అమీ జాక్సన్ 41 ఏళ్లు చిన్నది. కానీ వెండి తెర మహిమ, సూపర్ స్టార్ నటన ప్రతిభ ఆ తేడాని పక్కకు పెట్టడం ఖాయం.