అక్కినేని అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏజెంట్’. ‘ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్’, ‘సురేందర్ 2 సినిమా’ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్, టీజర్, ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ నమోదు చేశాయి. హిపాప్ తమిళ సంగీతంలో రూపొందిన పాటల్లో ‘వైల్డ్ సాలా’ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ట్రైలర్ అయితే హాలీవుడ్ సినిమాలను తలపించింది.
అసలు ఈ అఖిల్ లుక్ లో హాలీవుడ్ హీరోలా ఉన్నాడు అని చెప్పాలి. అందుకే నిర్మాత కూడా రూ.80 కోట్ల బడ్జెట్ ను పెట్టి ఇతని కెరీర్లో బిగ్ బడ్జెట్ మూవీగా తీర్చిదిద్దాడు. ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి కూడా నటించడం వల్ల అక్కడ కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు . ‘ఏజెంట్’ చిత్రానికి అఖిల్ కెరీర్లోనే హయ్యెస్ట్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం
10.40 cr
సీడెడ్
4.30 cr
ఉత్తరాంధ్ర
3.60 cr
ఈస్ట్
2.40 cr
వెస్ట్
2.10 cr
గుంటూరు
2.65 cr
కృష్ణా
2.20 cr
నెల్లూరు
1.08 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
28.73 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
1.40 cr
మలయాళం
0.70 cr
ఓవర్సీస్
3.50 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
29.79 cr (షేర్
‘ఏజెంట్’ (Agent) చిత్రానికి రూ.34.33 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.35 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. అఖిల్ కెరీర్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఆ మూవీ రూ.25 కోట్ల షేర్ ను రాబట్టింది. మరి ‘ఏజెంట్’ రూ.35 కోట్లు షేర్ ను రాబట్టాలి అంటే బ్లాక్ బస్టర్ టాక్ రావాలి.