డిఫరెంట్ కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను చూరగొన్న తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’. 18 మిలియన్ యూజర్స్‌తో తన ప్రత్యేకతను చాటుకుంటున్న ఈ తెలుగు ఓటీటీ యాప్ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం జరిగింది. ‘ఆహా’కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న అల్లు అర్జున్ ఈ కార్యక్రమాంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఇంకా కార్యక్రమంలో మై హోం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రమోటర్ ఆఫ్‘ఆహా’.. రామ్ జూపల్లి, ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, అల్లు బాబీ, వంశీ పైడిపల్లి, తమన్నా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది దీపావళి నుండి వచ్చే ఏడాది దీపావళి వరకు ‘ఆహా’ ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్షకులను అందించనుంది.. ఎలాంటి కంటెంట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎవరెవరు కంటెంట్‌ను అందిస్తున్నారు. అనే విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో…
మై హోం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రమోటర్ ఆఫ్‘ఆహా’.. రామ్ జూపల్లి మాట్లాడుతూ ‘‘ఫిబ్రవరిలో ఆహా యాప్ ప్రివ్యూను లాంఛ్ చేశాం. మార్చిలో గ్రాండ్ లెవల్లో లాంచ్ చేద్దామని అనుకున్నాం. అయితే అనుకోకుండా కోవిడ్ ప్రభావం ప్రారంభం కావడంతో అనుకున్నట్లు చేయలేకపోయాం. అయితే పరిస్థితులను మేం ఛాలెంజింగ్‌గా తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించడానికి సిద్ధమయ్యాం. నమ్మకంతో, ప్రణాళికా బద్ధంగా పనిచేస్తూ వచ్చాం. దీంతో ప్రస్తుతం ఆహా తెలుగు సినిమా ఇండస్ట్రీలో గేమ్ ఛేంజర్ అయ్యింది. రాబోయే రోజుల్లో మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌తో అందరినీ అలరించడానికి మావంతు ప్రయత్నం మేం చేస్తాం. మానాన్నగారు, మై హోమ్స్ ఛైర్మన్ డా.రామేశ్వర్‌రావు ఆయన స్టార్ట్ చేసిన ప్రతి పనిలో నెంబర్‌వన్‌గా ఉండటానికి ప్రయత్నిస్తారు. అందుకు తగినట్లు అన్నింట బెస్ట్ ఔట్‌పుట్ ఇవ్వడానికి మాకు స్ఫూర్తినిస్తూ వచ్చారు. దీంతో మేం ఈరోజు తెలుగు ఓటీటీ మాధ్యమాల్లో నెంబర్‌వన్‌గా నిలిచాం. ఆహాను ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. రోజురోజుకీ ఆహా వ్యూవర్స్ పెరుగుతూ వస్తున్నారు. ఇది మాపై మరింత బాధ్యతను పెంచుతోంది. ఈ జర్నీలో సహకరించిన మా భాగస్వామ్యులకు ధన్యవాదాలు’’ అన్నారు.
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘అల్లు అరవింద్‌గారు నన్ను ఆహాలో పార్ట్ అవమని చెప్పినప్పుడు నాకున్న మూవీ ప్రొడక్షన్ బిజీ కారణంగా మా అమ్మాయి, అల్లుడుని ఇందులో పార్ట్ చేశాను. నేను అరవింద్‌గారికి ఓ ఫోన్ కాల్ దూరంలో ఉంటాను. మా మధ్య అంత మంచి అనుబంధం ఉంది. ఆహా స్టార్ట్ అయిన 9 నెలల కాలంలో ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులందరినీ మెప్పిస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ఈ 9 నెలలను చూస్తే నా దృష్టిలో చాలా తక్కువే. అసలు సినిమా ఆహాలో ఇప్పుడు మొదలవుతుంది. నా 25ఏళ్ల సినీ జర్నీలో నేను గమనించిన దాని ప్రకారం అరవింద్‌గారు ఏమీ పనిచేసినా అందులో సక్సెస్ అయ్యారు. అరవిద్‌గారు, రామ్‌గారు ఆహాను ఇప్పుడు తమ భుజాలపై మోస్తున్నారు. ప్రాంతీయ భాష తెలుగు యాప్ ఆహాను జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తారు’’ అన్నారు.
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘ఫిబ్రవరిలో ఆహాను స్టార్ట్ చేసినప్పుడు ఉగాది నుండి వచ్చే ఏడాది ఉగాది లోపు 40-50 ప్రోగ్రామ్స్ చేయాలని ప్లాన్ చేశాం. అయితే కోవిడ్ వచ్చింది. నేను ఆహా ఆఫీస్‌కి వెళ్లలేదు. జూమ్‌లోనే కథలు వింటూ వచ్చాను. ఆ సమయంలో వంశీ పైడిపల్లిని కలిసి మా ఆహా టీమ్ కంటెంట్ మేనేజ్‌మెంట్ బోర్డులోకి ఆహ్వానించాను. తనకి చీఫ్ క్రియేటివ్ అడ్వజర్‌గా వంశీని నియమించాను. తను నా రిక్వెస్ట్‌కి అంగీకరించి మా టీమ్‌తో కలిసి పనిచేస్తున్నందుకు వంశీకి థాంక్స్. అలాగే దీపావళి టు దీపావళికి ఆహా ప్లాన్ చేసిన అనేక ప్రోగ్రామ్స్‌లో పది ఎగ్జయిట్‌మెంట్ ప్రోగ్రామ్స్ గురించి చెబుతాను. అందులో మొదటిది సామ్‌జామ్..టాక్ షో. సమంతగారు హోస్ట్ చేస్తున్నారు. దీన్ని నందినీ రెడ్డి డైరెక్ట్ చేశారు. అలాగే లెవన్త్ అవర్ వెబ్ సిరీస్, కమిట్‌మెంటల్, మావింతగాథ వినుమా, అనగనగా ఓ అతిథి వంటి కంటెంట్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తాం’’ అన్నారు.
డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ‘‘ఆహా అనేది ఓ సంకల్పం. దాన్ని పూర్తి చేస్తున్న రామేశ్వర్‌రావుగారికి, రామ్‌గారికి, అరవింద్‌గారికి కంగ్రాట్స్. తెలుగు ప్రేక్షకులను నమ్మి స్టార్ట్ చేసిన ఓటీటీ ఆహా. కోటి ఎనబై లక్షల మంది యూజర్స్ ఇందులో జాయిన్ అయ్యారు. ప్యాషన్ ఉన్న టీమ్‌తో కలిసి వర్క్ చేస్తున్నాను. రోజుకి రూపాయి లెక్కలో సంవత్సరానికి 365 రూపాయలు ఆహా కోసం పెడితే అందుకు వంద రెట్లు ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆహా అందిస్తుందని ప్రామిస్ చేస్తున్నాను’’ అన్నారు.
తమన్నా మాట్లాడుతూ ‘‘తెలుగు పోర్టల్ ఆహాలో వర్క్ చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ప్రపంచంలో తెలుగు సినిమా ఓ ప్రత్యేకతను సంపాదించకుంది. ఇప్పుడు అలాంటి ప్రత్యేకతను తెలుగు యాప్ ఆహా సంపాదించుకుంటుందని భావిస్తున్నాను. డిఫరెంట్ కంటెంట్‌తో చేసిన లెవన్త్ అవర్ చేయడం హ్యాపీగా ఉంది. ప్రవీణ్ సత్తారుగారు, ప్రదీప్‌గారు కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ మిమ్మల్ని మెప్పిస్తుంది’’ అన్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘రెండు మూడేళ్ల క్రితం నాన్న ఇంటికి ఎంత రాత్రి వేళ వచ్చినా టీవీల్లో షోస్ చూస్తుండేవాడు. సినిమాల కంటే ఎక్కువగా షోస్ ఎక్కువగా ఎందుకు చూస్తున్నారని.. నాకు చాలా బాగా నచ్చుతున్నాయి. ఇలాంటి వాటిని తెలుగుకి తీసుకు రావాలని ఆయన అన్నప్పుడు ఇదయ్యే పనేనా అని ఆయనతో అన్నాను. కానీ తీసుకొస్తే బావుంటుందని అన్నారు. నా ప్యామిలీ ఫ్రెండ్స్ అయిన మై హోం గ్రూప్ రామ్‌తో ఓ సందర్భంలో నాన్నఓటీటీ ఐడియా గురించి చెప్పాను. ఐడియా వినగానే వాళ్లు చాలా ఎగ్జయిట్ అయ్యారు. మాపై నమ్మకంతో ఓటీటీని స్టార్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. అలా మాపై నమ్మకంతో ఓటీటీ స్టార్ట్ చేయడానికి ముందుకు వచ్చిన జూపల్లి ఎంటైర్ ఫ్యామిలీకి ప్రత్యేక ధన్యవాదాలు. మా అల్లు ఫ్యామిలీ ఇలా చేస్తే బావుంటుందని అనుకుంటే, వాళ్లు చేయడానికి ముందుకు రావడం చాలా గొప్ప విషయం. రామేశ్వర్‌రావుగారికి, రాముగారికి, జూపల్లి కుటుంబానికంతా ధన్యవాదాలు. నాన్నగారు ఐదు దశాబ్దాలుగా ఎన్నో సూపర్‌హిట్ సినిమాలను నిర్మించారు. సినీ పరిశ్రమలో ఆయన చాలా చేశారు కానీ.. ఇది మాత్రం ఆయనకు మెమొరబుల్ స్టెప్. ఓటీటీ అనేది సినిమా కాదు.. ఇదొక ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ ఎలా ఉందో, రేపు డిజిటల్ ఇండస్ట్రీ అనేది క్రియేట్ అవుతుంది. అది కూడా తెలుగులో మనం స్టార్ట్ చేయడం మంచి అనుభూతినిస్తుంది. ప్యూర్ తెలుగు ఓటీటీ ఛానెల్ స్టార్ట్ కావడంలో భాగమైనందుకు గర్వంగా ఉంది. ఇది మెమొక్కరమే చేయాల్సిన జర్నీ కాదు. కంటెంట్ పరంగా ఎవరూ బెటర్ అని ఆలోచిస్తే దిల్‌రాజుగారి కంటే బెటర్ ఎవరూ లేరు. ఆయనతో కలిసి ఈ జర్నీని స్టార్ట్ చేశాం. ఓటీటీ కంటెంట్ అంటే యంగ్ మైండ్ ఉండాలి. ఎవరైతే బావుంటుందని ఆలోచించినప్పుడు నాకు బ్రదర్ విజయ్ దేవరకొండ గుర్తొచ్చాడు. తను కూడా ఈ జర్నీలో పార్ట్ అయ్యాడు. ఇలా అందరూ ఆహాలో యాడ్ అవుతూ వచ్చారు. ఎంతో మంది క్రియేటివ్ పర్సన్స్ ఇందులో జాయిన్ అయ్యారు. నెంబర్ వన్ తెలుగు ఫ్లాట్‌ఫాంగా దీన్ని మార్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆహాకు ఏదైనా చేయాలనిపించింది. అప్పుడే అల వైకుంఠపురములో సినిమా పూర్తయ్యింది. మీరు, త్రివిక్రమ్ కలిసి ఏదైనా చేయొచ్చు కదా.. అని అడిగినప్పుడు నేను, త్రివిక్రమ్‌గారు కలిసి ఓ యాడ్ చేశాం. అంతే కాకుండా నాతో కలిసి పనిచేసిన నలుగురు దర్శకులు ఆహాలో షోస్ చేస్తున్నారు. సుకుమార్‌గారు ఓ అద్భుతమైన షో చేయబోతున్నారు. అలాగే హరీశ్ శంకర్ కూడా ఆహా కోసం ఓ షో చేస్తున్నారు. సురేందర్ రెడ్డిగారు కూడా ఓ షో చేస్తున్నారు. వంశీ పైడిపల్లిగారు కూడా ఆహా కోసం ఓ షో చేస్తున్నారు. వీరుచేయబోయే షోస్ గురించి అప్‌డేట్స్ త్వరలో ఇస్తాం’’ అన్నారు.
Most Recommended Video
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!