కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడటంతో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా గతేడాది అమెజాన్ ప్రైమ్ వారు పెద్ద పెద్ద సినిమాలను విడుదల చేసి మిగిలిన ఓటిటి సంస్థలకు షాక్ ఇచ్చారు. అయితే ప్రైమ్ లో విడుదలైన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. ఒక్క ఆకాశమే నీ హద్దురా మాత్రమే వాళ్ళకి మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ ఏడాది వాళ్ళు..
ఏక్ మిని కథ, పచ్చీస్ సినిమాలను విడుదల చేశారు. ఏక్ మినీ కథ బానే రానించింది. కానీ పచ్చీస్ మూవీ నిరాశపరిచింది.తర్వాత వాళ్ళు మరో సినిమాని విడుదల చేయలేదు. పెద్ద సినిమా నిర్మాతలు థియేటర్లలో తమ సినిమాలను విడుదల చేస్తామని భీష్మించుకు కర్చున్నారు.చిన్న సినిమాల నిర్మాతలు అయితే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి 4 రెట్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రైమ్ వారు అసహనానికి గురవుతున్నారు అని తెలుస్తుంది.
మరోపక్క ఆహా వారు మాత్రం వారానికి 3 సినిమాలు రిలీజ్ చేస్తూ దూసుకుపోతున్నారు. డబ్బింగ్ సినిమాలు ఉన్నప్పటికీ వాళ్లకు అవి బాగానే గిట్టుబాటు అవుతున్నాయి. పైగా వీళ్ళ ప్రమోషన్ కూడా బాగుంటుంది. అమెజాన్ వారు మిగిలిన అన్ని భాషల్లోనూ సత్తా చాటుతున్నారు. తెలుగు విషయంలో వాళ్ళు కొత్త ప్లాన్ ను అమలు చేస్తే మంచిదని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ను తక్కువ రేట్లకు ఇస్తున్న సంగతి తెలిసిందే