Aaradhya school fee: కూతురు స్కూల్ ఫీజు కోసం లక్షలు ఖర్చు చేస్తున్న ఐశ్వర్య!

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీ కపుల్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ దంపతులు ఒకరు. సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి ఈ దంపతులు పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే వీరికి ఆరాధ్య అనే ఒక కుమార్తె జన్మించిన విషయం మనకు తెలిసిందే. ఆరాధ్య అప్పుడే టీనేజ్ లోకి కూడా అడుగు పెట్టారు.

ఇక ఐశ్వర్యారాయ్ ఏ ఫంక్షన్ కి వెళ్లిన ఎక్కడికి వెళ్లినా తనతో పాటు తన (Aaradhya) కూతురిని కూడా వెంట తీసుకు వెళుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాము ఇలా తల్లి కూతుర్ల మధ్య విడదీయరా అని అనుబంధం ఉందని చెప్పాలి. ఇకపోతే తాజాగా ఐశ్వర్యరాయ్ అభిషేక్ కుమార్తె ఆరాధ్య గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతో స్టార్ హోదా ఉన్నటువంటి ఈ సెలబ్రిటీలు తమ కూతురి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు అనే విషయం మనకు తెలిసిందే.

కోట్ల రూపాయలు డబ్బు సంపాదించే సెలబ్రిటీలు అందులో ఎక్కువ భాగం తమ పిల్లల లగ్జరీ లైఫ్ కోసమే ఖర్చు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో భారీగానే ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక ఐశ్వర్య ఆరాధ్య కూడా తన కుమార్తె కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారట ముఖ్యంగా తన కుమార్తె చదువు కోసం ఈ దంపతులు సంవత్సరానికి కొన్ని లక్షల్లో ఖర్చు చేస్తున్నారని తెలుస్తుంది. ఐశ్వర్య ఆరాధ్య కుమార్తె ముంబైలోని ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్ అయినటువంటి ధీరుబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారట.

ఈ స్కూల్లో ఫీజులు భారీ మొత్తంలోనే చెల్లించాల్సి ఉంటుంది అయితే చాలామంది సెలబ్రిటీలకు సంబంధించిన పిల్లలు ఇదే స్కూల్లోనే చదువుతూ ఉంటారు. కేజీ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు చదవాలి అంటే ఐదు నుంచి పది లక్షల రూపాయల వరకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుందట అదే ప్లస్ వన్ స్టడీస్ కోసం అయితే దాదాపు 20 లక్షల వరకు ఏడాదికి ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని ఇవి కాకుండా అదనంగా మరికొన్ని ఖర్చులు కూడా వస్తాయని చెబుతున్నారు. ఏది ఏమైనా స్కూల్ ఫీజులే లక్షల్లో చెల్లిస్తున్నారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus