SSMB28: మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో ఐశ్వర్య రోల్ ఇదేనా?

మహేష్ త్రివిక్రమ్ కాంబో సినిమాకు సంబంధించి వస్తున్న ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు అని నిర్మాత వెల్లడించగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించిన నేపథ్యంలో నిర్మాతలు సైతం ఆ తేదీకే ఈ సినిమాను రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో ఐశ్వర్యా రాయ్ కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం. ఈ సినిమాకు 300 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

పొలిటికల్ డ్రామాగా ఢిల్లీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. మహేష్ ఈ మూవీ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకుని రాజమౌళి సినిమాతో బిజీ కావాలని మహేష్ భావిస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో సినిమా మొదలైతే మహేష్ మూడేళ్ల పాటు ఈ సినిమాకే పరిమితం కావాల్సి ఉంటుంది.

మహేష్ రాజమౌళి కాంబో మూవీపై భారీ రేంజ్ లో అంచనాలు ఏర్పడగా ఈ సినిమా ఆ అంచనాలను మించి ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus