వారిద్దరి ఆవేశాన్ని ఆయుధంగా మార్చుతాడట

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఎప్పుడు తిరిగి ప్రారంభం అవుతుందా అని ఎన్టీఆర్, చరణ్ అభిమానులతో పాటు, సగటు మూవీ లవర్ ఆసక్తికా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ వండర్ పై దేశవ్యాప్తంగా అంచనాలున్నాయి. అనేక అవరోధాలతో షూటింగ్ వాయిదాపడుతూ వచ్చింది. తీరా సవ్యంగా సాగుతుందనుకుంటున్న సమయంలో లాక్ డౌన్ కోలుకోలేని దెబ్బగొట్టింది. దర్శకుడు రాజమౌళి కావడంతో పాటు, చరణ్-ఎన్టీఆర్ నటిస్తున్న మల్టీస్టారర్ కావడంతో మూవీ లేటవుతున్నా ఏమాత్రం ఆసక్తికి తగ్గలేదు.

కాగా ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ గణ్ కీలక రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ కథలో అజయ్ దేవ్ గణ్ రోల్ కీలకం అని తెలుస్తుండగా, ఆయన పాత్రపై క్రేజీ గాసిప్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్, చరణ్ పాత్రలను వీరులుగా తీర్చిద్దిదే యోధుడిగా, గురువుగా అజయ్ దేవ్ గణ్ పాత్ర ఉంటుందట. వ్యవస్థపై, వ్యక్తులపై కోపంతో వారిని ఏమి చేయలేక ఇల్లు వదిలి అడవిబాట పట్టిన అల్లూరి, కొమరం భీమ్ లలో ఉన్న ఆవేశాన్ని ఆయుధంగా మార్చే మార్గదర్శకుడిగా, యుద్ధ విద్యలలో శిక్షణ ఇచ్చే గురువుగా అజయ్ దేవ్ గణ్ పాత్ర ఉంటుందట

.

ఇక వీరిద్దరిని మెరికలుగా, మారణాయుధాలుగా మార్చే క్రమంలో ఎన్టీఆర్,చరణ్ లతో అజయ్ దేవ్ గణ్ చేయించే సాహసాలు అబ్బురపరుస్తాయట. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో కానీ వింటుంటే గూస్ బంప్స్ కలుగుతున్నాయి.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus