ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ సెట్స్ లోకి అజయ్ దేవగణ్ ఎంట్రీ

దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టారు . ఈ చిత్ర తాజా షెడ్యూల్ నేడు ప్రారంభమైంది. కాగా నేటి షూటింగ్ షెడ్యూల్ నందు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ పాల్గొన్నారు. తాజా షెడ్యూల్ నందు ఆయన పై వచ్చే కొన్ని సన్నివేశాల చిత్రీకరణ ఉన్న నేపథ్యంలో అజయ్ సెట్స్ కి హాజరయ్యారు. అజయ్ దేవగణ్ ఆర్ ఆర్ ఆర్ లో ఓ కీలక రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కథ రీత్యా ఓ బలమైన వీరుడి పాత్ర కోసం అజయ్ దేవగణ్ ని తీసుకోవడం జరిగింది. కథలో ప్రాధాన్యం ఉన్న కీలక మైన రోల్ కావడంతో అజయ్, రాజమౌళి ఆఫర్ ని కాదనకుండా ఒకే చేశారు. ఇక ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఆర్ ఆర్ ఆర్ చిత్ర విడుదల జులై నుండి అక్టోబర్ కి వాయిదా పడనుందని పరోక్షంగా చెప్పారు.

మొన్నటివరకు తన లేటెస్ట్ మూవీ తన్హాజీ ప్రమోషన్స్ లో బిజీగా గడిపిన అజయ్ దేవ్ గన్ ఆర్ ఆర్ ఆర్ సెట్స్ లో పాల్గొంటున్నారు. అజయ్ దేవగణ్ వందవ చిత్రంగా వచ్చిన తన్హాజి వంద కోట్లకు పైగా వసూళ్లతో సూపర్ హిట్ గా నిలిచింది. పీరియాడిక్ మూవీగా తెరకెక్కించిన తన్హాజీ చిత్రంలో అజయ్ ఛత్రపతి శివాజీ సైన్యాధ్యక్షుడిగా టైటిల్ రోల్ చేశారు. ఈ మూవీలో మరో హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడి రోల్ చేశారు. కాజోల్ తన్హాజీ భార్య పాత్ర చేశారు.

Ajay Devgn begins shooting for Rajamouli's RRR Movie2

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus