అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘పుష్ప’.. 2021 లో కూడా అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన తెలుగు చిత్రంగా రికార్డులు కొల్లగొడుతుంది. ఇదిలా ఉండగా… ఈ చిత్రానికి మొదటి రోజు కొంత మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ నటనకి మాత్రం మంచి అప్లాజ్ దక్కింది. బన్నీ తర్వాత ఆ స్థాయిలో ‘పుష్ప’ నటించిన నటుడు ఎవరైనా ఉన్నారా అంటే కచ్చితంగా అది అజయ్ ఘోష్ అనే చెప్పాలి.
‘రంగస్థలం’ లో అతని పాత్ర ఎంత హైలెట్ అయ్యిందో ‘పుష్ప’ లో కూడా ఆయన పాత్ర అంతే హైలెట్ అయ్యింది. అయితే అజయ్ ఘోష్ ముందుగా ఈ చిత్రంలో నటించలేను అని చెప్పారట. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని తెలియజేయడం గమనార్హం. ఆయన మాట్లాడుతూ… “నేను ఈరోజు మీముందు ఉన్నాను అంటే అది ‘పుష్ప’ సినిమా వల్లే అని చెప్పాలి. ఈ సినిమా నాకు పునర్జన్మనిచ్చింది. కానీ నిజానికి ముందు ఈ సినిమా నేను చేయకూడదు అనుకున్నాను. దానికి కారణం నేను కరోనాకి గురవ్వడమే.
ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండే నన్ను కరోనా దెబ్బతీసింది. ఇంటినుంచి బయటకు రావాలంటేనే భయం పుట్టేది.కరోనా ఫస్ట్ వేవ్ రావడానికి కొన్ని నెలల ముందు నాకు హార్ట్ లో స్టెంట్ వేశారు. అయినప్పటికీ నేను బాగానే ఉన్నాను.కానీ నాకు కరోనా అని తెలిసాక ఆందోళనకి గురయ్యాను. అదే టైములో నాకు బాగా తెలిసిన వాళ్ళు ఓ ప్రాజెక్ట్ పేరుతో నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టారు. ఆ టైములో ఇక సినిమాలు చేయకూడదు అనుకున్నాను.
అయితే అప్పటికే పుష్పకి నేను కమిట్ అయ్యాను. కానీ ఆ పరిస్థితుల్లో ‘పుష్ప’ నుండీ తప్పుకోవాలనుకున్నా.’పుష్ప’ టీమ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. నేను ఈ సినిమా చేయలేను నన్ను వదిలేయండి అని అన్నాను. కానీ ఓ రోజు దర్శకుడు సుకుమార్ గారే స్వయంగా ఫోన్ చేసి అరగంట మాట్లాడారు. ఆయన మాట్లాడటంతో కన్విన్స్ అయిపోయాను. ఆయన అంతలా నన్ను మోటివేట్ చేశారు. మారేడుమిల్లిలో షూటింగ్ మొదలైనప్పుడు నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను అనేవాడిని.
అప్పుడు నన్ను నార్మల్ మూడ్ లోకి తీసుకురవడానికి సుకుమార్ గారు నా ముందు డ్యాన్స్ కూడా చేశారు. తమిళ్ నేను నటించిన ‘మూకుతి అమ్మన్’ మూవీలో నా పై ఓ పాట ఉంటుంది. సుకుమార్ గారు ఆ పాటకి డ్యాన్స్ చేస్తూ.. ‘అజయ్ అలాగే చేస్తున్నానా’ అంటూ నాలో హుషారు నింపారు. సినిమా అంటే ఆయనకు అంత తాపత్రయం” అంటూ అజయ్ ఘోష్ చెప్పుకొచ్చారు.