స్టార్ హీరో కారుకు యాక్సిడెంట్ అవడం కల కలం సృష్టించింది.వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ స్టార్ హీరో కారుకు పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. ఈ క్రమంలో అతనికి పెను ప్రమాదం… తప్పింది అని చెప్పాలి. అజిత్ కి (Ajith) బైక్ రేసింగ్ , కారు రేసింగ్ అంటే బాగా ఇష్టం అనే సంగతి తెలిసిందే. అయితే ఆయన తాజాగా రేసింగ్ ప్రాక్టిస్ చేస్తుండగా.. అదిపు తప్పు ట్రాక్ పక్కన ఉన్న గోడను ఢీ కొట్టింది ఆయన రైడింగ్ కారు.
Ajith
స్పీడ్ గా వెళ్తున్న టైమ్లో అది బ్యాలెన్స్ తప్పినట్టు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో వెంటనే ఆయన కారు వద్దకి సిబ్బంది వెళ్లి చూడగా… ఆయనకు ఎలాంటి గాయాలు కాకుండా బయటకి రావడాన్ని గమనించి.. అక్కడి నుండీ వేరే కారులో తరలించారు. దీంతో అక్కడ ఉన్న వారు అంతా ఊపిరి పీల్చుకున్నట్టు అయ్యింది. కానీ తమిళ మీడియా వర్గాల్లో కొంతమంది అది ఫేక్ వీడియో అంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
అజిత్ కి తమిళంలోనే కాకుండా తెలుగులో, మలయాళంలో కూడా మంచి క్రేజ్ ఉంది. కొన్నాళ్ళుగా ఆయనకి సరైన సక్సెస్ పడడం లేదు. వివేకం (Vivegam), వలీమై, తెగింపు వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం అదిక్ రవి చంద్రన్ దర్శకత్వంలో ఆయన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరోపక్క తమిళంలో విధముయార్చి అనే సినిమాని కూడా కంప్లీట్ చేశాడు.