Ajith: అజిత్‌ కొత్త వీడియో వైరల్‌.. తర్వాతి తరం కూడా ఇందులోనే!

అజిత్‌  (Ajith Kumar) కేవలం నటుడు మాత్రమే కాదు.. కుక్‌, ఫొటోగ్రాఫర్‌, రేసర్‌ అని కూడా తెలిసిందే. ఇటీవల వరుస రేసుల్లో తన టీమ్‌ తరఫున పాల్గొని కప్‌లు కూడా గెలుస్తున్నాడు. షూటింగ్స్‌ లేకపోతే రేసింగ్‌ బైక్స్‌, కార్లతో అజిత్‌ కాలక్షేపం చేస్తుంటారనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సరదాను తన తనయుడికి కూడా అలవాటు చేస్తున్నాడు. ఇటీవల విదేశాల నుండి చెన్నై తిరిగొచ్చిన అజిత్‌ ‘మద్రాస్‌ ఇంటర్నేషనల్‌ కార్టింగ్‌ అరేనా’ గోకార్ట్‌ రేసు కోర్ట్‌తో కుటుంబంతో కలిసి కనిపించాడు.

Ajith

దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అందులో తన కుమారుడు ఆద్విక్‌కు కారు రేసింగ్‌లో మెలకువలు నేర్పిస్తూ అజిత్‌ కనిపించాడు. ఇటీవల పాఠశాలలో జరిగిన రన్నింగ్ రేస్‌లో ఆద్విక్ గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. బ్రెజిల్ లెజెండ్స్ జట్టు, ఇండియా ఆల్ స్టార్స్ జట్టు మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లోనూ ఆద్విక్ సత్తా చాటాడు. బ్రెజిలియన్ ఫుట్‌బాల్ లెజెండ్ రొనాల్డినో అంటే అథ్విక్‌కు ఇష్టం. అతనిని చూసి ఇన్‌స్పైర్‌ అవుతా అని కూడా చెప్పాడు.

ఇక అజిత్‌ సంగతి చూస్తే.. నటన కాకుండా ఇతర రంగాలపై తనకున్న ఇష్టాన్ని ఇప్పుడిప్పుడే నిజం చేసుకుంటున్నాడు. అజిత్ కుమార్ రేసింగ్ జట్టు తరపున ఈ ఏడాది జనవరిలో దుబాయిలో జరిగిన కార్ రేసింగ్‌లో పాల్గొని 3వ స్థానంలో నిలిచింది. ఇటలీలో జరిగిన 12హెచ్‌ రేస్‌లో మూడో స్థానం దక్కించుకుంది. అంతకుముందు ఓ కప్‌ కూడా గెలుచుకున్నారు. ఇక చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థుల ఉమ్మడి ప్రాజెక్ట్ ‘తక్ష డ్రోన్ ప్రాజెక్టు’కు అజిత్‌ ఇటీవల సలహాదారుగా వ్యవహించారు.

సినిమాల సంగతి చూస్తే.. అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) దర్శకత్వంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) అనే సినిమా చేశారు. ఈ నెల 10న ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఇదే సంవత్సరంలో ‘పట్టుదల’ (Pattudala)  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా మన దగ్గర ఆశించిన ఫలితం ఇవ్వలేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus