Ajith: అజిత్‌ సూపర్‌హిట్‌ మళ్లీ తీస్తున్నారట!

అజిత్‌ను ప్రేక్షకులకు బాగా దగ్గర చేసిన సినిమాల్లో ‘వాలి’ ఒకటి. అజిత్‌లోని నటుణ్ని వెండితెరపై ఆవిష్కరించిన చిత్రమిది. ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తెలుగులోనూ విడుదలై మంచి విజయం అందుకుంది. అయితే ఈ సినిమాను రీమేక్ చేయాలని ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ చాలా రోజుల నుండి చూస్తున్నారు. ఆ మధ్య ప్రారంభిద్దామని కూడా అనుకున్నారు. అయితే ఎస్‌.జె.సూర్య అడ్డుపడ్డారు. కోర్టుకి కూడా వెళ్లారు. తాజాగా దీనిపై తీర్పు వచ్చింది.

‘వాలి’ సినిమా రీమేక్‌ విషయంలో కోర్టు తీర్పు బోనీ కపూర్‌కు అనుగుణంగా వచ్చింది. దీంతో ఈ సినిమా పనులు త్వరలోనే ప్రారంభిస్తున్నారట. హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమాను రీమేక్‌ చేస్తామని బోనీ కపూర్‌ చెబుతున్నారు. 22 ఏళ్ల నాటి సినిమాను, అందులోనూ ఇప్పటికే తెలుగులోకి వచ్చిన సినిమాను ఇప్పుడు మళ్లీ తీస్తే చూస్తారా అనేది తెలియడం లేదు. అయితే సినిమనాఉ కాన్సెప్ట్‌ మాత్రం యూత్‌కి భలేగా నచ్చేస్తుంది.

ఇటీవల కాలంలో బోనీ కపూర్‌ వరుసగా సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. కేవలం బాలీవుడ్‌ అనే కాకుండా దక్షిణాదిలోనూ సినిమాలు చేస్తున్నారు. తమిళనాటు అజిత్‌తో వరుస సినిమాలు చేసిన ఆయన… ఇప్పుడు అజిత్‌ చేసిన సినిమాను రీమేక్‌ చేయబోతున్నారు. అలా అజిత్‌తో తన జర్నీని బోనీ కొనసాగిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలకు సినిమా చేరువ చేయాలంటే హీరో ఎవరనేది తెలియాలి. చూద్దాం ‘వాలి’ 22 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus