Akash Puri, Prabhas: అసలు మేటర్ ను బయట పెట్టిన ఆకాష్ పూరి..!

పూరి జగన్నాథ్ ఫ్యామిలీ కి ప్రభాస్ కు మంచి సాన్నిత్యం ఉంది. పాన్ ఇండియా స్టార్ అయ్యుండి.. ఒక రోజు కాల్ షీట్ మొత్తం పూరి కొడుకు సినిమా కోసం ఇచ్చేసాడు ప్రభాస్. రొమాంటిక్ టీం తో కలిసి ట్రైలర్ లాంచ్ చేయడం అలాగే రీల్స్ చేయడం.. హీరో, హీరోయిన్స్ ని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఇంటర్వ్యూలో ఎన్నడూ లేనంత యాక్టివ్ గా ప్రభాస్ కనిపించాడు.

హీరో, హీరోయిన్లపై సెటైర్లు వేస్తూనే మంచి ఫన్ జెనరేట్ చేశాడు. ‘హాయ్ మేడం ఐ యామ్ ప్రభాస్ ఫ్రమ్ మొగల్తూర్’ , ‘ఆ అమ్మాయి బాత్ రూమ్ లో నేనెందుకు ఉంటాను రా.. గజాలా పాడెయ్యి’ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగులు మీమ్ పేజెస్ వాళ్ళకి మంచి స్టఫ్ ఇచ్చాయి. నాలుగైదు రోజుల వరకు ఆ ఇంటర్వ్యూ ట్రెండ్ అయ్యింది. రొమాంటిక్ ప్రమోషన్లకు.. మంచి ఓపెనింగ్స్ రావడానికి ఆ ఇంటర్వ్యూ చాలా హెల్ప్ అయ్యింది.

అయితే ఆ ఇంటర్వ్యూ మొత్తం స్పాంటేనియస్ గా జరిగింది అని అంతా అనుకున్నారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అట. ఈ విషయాన్ని స్వయంగా పూరి తనయుడు ఆకాష్ చెప్పుకొచ్చాడు. తన ‘చోర్ బజార్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం పై ప్రస్తావించాడు.

‘అదంతా డాడీ డైరెక్షన్లో చేసిన ఇంటర్వ్యూ. అంతా స్క్రిప్టెడే…’ అంటూ అసలు విషయాన్ని బయటపెట్టాడు ఆకాష్. అలాగే అదే రోజు ‘ఆదిపురుష్’ సినిమాకి సంబంధించి కొన్ని విజువల్స్ కూడా చూపించారట ప్రభాస్. అవి అదిరిపోయాయని, ఫ్యాన్స్ కు ట్రీట్ లా ఉంటాయని ఆసక్తి పెంచాడు ఆకాష్.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus