Akash Puri, Prabhas: ఆ హీరో డౌన్ టు ఎర్త్ ఉంటారన్న ఆకాశ్ పూరి!

పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ గత శుక్రవారం థియేటర్లలో విడుదలై యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆకాష్ పూరి మాట్లడుతూ నా బిగ్గెస్ట్ క్రష్ అనుష్క శెట్టి అని చిన్నప్పటి నుంచి ఆమె నా ఫేవరెట్ హీరోయిన్ అని అన్నారు. నేను నైట్ పర్సన్ అని రాత్రి సమయంలోనే సినిమాలు చూడాలని బైక్ పై బయటకు వెళ్లాలని అనిపిస్తుందని ఆకాశ్ పూరి తెలిపారు.

నాకు రియల్ లైఫ్ లో రజనీకాంత్ అంటే చాలా ఇష్టమని ఆయన నాకు ఇన్స్పిరేషన్ అని ఆకాశ్ పూరి చెప్పుకొచ్చారు. ప్రభాస్ గారితో రిలేషన్ అంటే ఆయన నన్ను తమ్ముడిలా చూస్తారని ఆకాశ్ పూరి చెప్పుకొచ్చారు. కొన్నిరోజుల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ గారిని కలిశానని ఆకాశ్ పూరి తెలిపారు. ప్రభాస్ గారు డౌన్ టు ఎర్త్ అని ఎంత డౌన్ టు ఎర్త్ అంటే మరీ డౌన్ టు ఎర్త్ అని ఆకాష్ పూరి అన్నారు. అప్పుడప్పుడూ ప్రభాస్ మంచితనం గురించి ఎలా చెప్పాలా అని అనుకుంటానని ఆకాశ్ పూరి వెల్లడించారు.

చోర్ బజార్ సినిమాతో తనకు మాస్ హీరోగా గుర్తింపు దక్కిందని ఆకాశ్ పూరి పేర్కొన్నారు. గత సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా గ్రాండ్ గా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయని ఆకాశ్ పూరి చెప్పుకొచ్చారు. నిర్మాత వీఎస్‌ రాజు వల్లే సినిమా గ్రాండ్ గా ఉందని ఆకాశ్ పూరి అన్నారు. నేను జనాల్లోకి హీరోగా వెళ్లిపోయానని ఆకాశ్ పూరి కామెంట్లు చేశారు. ఆకాశ్ పూరికి జోడీగా గెహనా సిప్పీ నటించగా ఆమె నటనకు సైతం మంచి మార్కులు పడ్డాయి.

తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కిన చోర్ బజార్ సినిమా ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. పూరీ జగన్నాథ్ తన కొడుకు కెరీర్ పై దృష్టి పెట్టి ఆకాశ్ పూరి బ్లాక్ బస్టర్ హిట్లు సాధించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus