నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో ‘అఖండ’ సినిమా వచ్చింది. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దానికి సీక్వెల్ గా ‘అఖండ 2′(అఖండ – తాండవం) రాబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా. వాస్తవానికి ‘అఖండ’ సినిమాలో ఎక్కువ హైలెట్ గా నిలిచింది అఖండ రుద్ర సికందర్ ఘోరా… అంటే అఘోర పాత్ర.
అందుకే ‘అఖండ 2’ ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన ఫస్ట్ టీజర్ లో ఆ పాత్రనే హైలెట్ చేశారు. హిమాలయాల్లో ఆ పాత్ర ఉంటున్నట్టు చూపించి టెర్రరిస్టులను త్రిశూలంతో శత్రుసంహారం చేసినట్లు చూపించి గూజ్ బంప్స్ తెప్పించారు. తాజాగా మురళీకృష్ణ(చిన బాలకృష్ణ) పాత్రని కూడా హైలెట్ చేస్తూ ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ పేరుతో మరో టీజర్ ను వదిలారు.

56 నిమిషాల నిడివి కలిగిన ఈ టీజర్లో బాలకృష్ణ యాక్షన్ యాంగిల్ ను చూపించారు. ‘సౌండ్ తగ్గించుకో.. ఏ సౌండ్ కి నవ్వుతానో, ఏ సౌండ్ కి నరుకుతానో నాకు కూడా తెలీదు. ఊహకు కూడా అందదు’ అంటూ విలన్ కి బాలయ్య వార్నింగ్ ఇవ్వడం అందరికీ గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది. ఆ వెంటనే గుర్రాలు సైతం బాలయ్య కోపానికి వెనకడుగు వేసినట్టు చూపించడం టీజర్ కి హుక్ పాయింట్ అని చెప్పాలి.
టీజర్ కి అదే హైలెట్ అని చెప్పాలి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే ఎందుకో ఈసారి ఆశించిన స్థాయిలో లేదు. అదొక్కటే డిజప్పాయింట్మెంట్ అని చెప్పాలి.
