Balakrishna: అఖండ మూవీ ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటుందా?

స్టార్ హీరో బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ మూవీ మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ నటిస్తున్నారు.

అఖండ సినిమాకు సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సెన్సార్ సభ్యుల నుంచి అఖండ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో అఘోరా పాత్ర ఎంట్రీ ఇంటర్వల్ తర్వాత ఉంటుందని బాలయ్య స్టైల్ సినిమాకు హైలెట్ గా ఉంటుందని సమాచారం. సినిమాలో ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ అద్భుతంగా ఉన్నాయని సమాచారం. పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. విలన్ గా శ్రీకాంత్ మేకోవర్ బాగుందని అఖండ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్స్ అంచనాలను మించి ఉందని సమాచారం.

అఖండ సెన్సార్ రిపోర్ట్ పాజిటివ్ గా ఉండటంతో బాలయ్య అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ సినిమా నిడివి 2 గంటల 40 నిమిషాలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం. ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus