స్టార్ హీరో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య అఘోరా గెటప్ లో కొత్తగా కనిపిస్తూ ఉండటంతో బాలయ్య అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు సైతం ఈ సినిమా కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అఖండ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 15వ తేదీన అఖండ ట్రైలర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలోని డైలాగ్ ఇదేనంటూ ఒక డైలాగ్ నెట్టింట వైరల్ అవుతోంది. “ఫ్రంట్ లేదు, బ్యాక్ లేదు, రైట్ లేదు, లెఫ్ట్ లేదు.. అటు వైపు నేనే ఇటు వైపు నేనే” అనే డైలాగ్ అఖండ ట్రైలర్ లోని డైలాగ్ అని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. బోయపాటి శ్రీను అఖండ సినిమాలో బాలయ్యతో పవర్ ఫుల్ డైలాగ్స్ ను చెప్పించబోతున్నారని ఈ డైలాగ్ ను వింటే అర్థమవుతోంది. ట్రైలర్ తో పాటే అఖండ సినిమా రిలీజ్ కు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. మిర్యాల రవీందర్ రెడ్డి ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన అఖండ రిలీజైన తర్వాత నిర్మాతకు ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాల్సి ఉంది. బాలయ్య ఈ సినిమా కోసం కేవలం 7 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారని సమాచారం. ప్రగ్య జైస్వాల్ ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా నటించారు. సింహా, లెజెండ్ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న బాలయ్య అఖండ సినిమాతో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.