స్టార్ హీరో బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నటించిన అఖండ మరో పది రోజుల్లో రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజవుతున్న పెద్ద సినిమా ఇదే కావడం గమనార్హం. అయితే వర్షాల వల్ల అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో అఖండ మేకర్స్ నిర్ణయం మారిందని సమాచారం.
మొదట ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో జరపాలని మేకర్స్ అనుకున్నారు. అయితే గత కొన్నిరోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని తెలుస్తోంది. ఈ సినిమా ఫైనల్ కట్ 2 గంటల 37 నిమిషాలతో రెడీ అయిందని సమాచారం. సినిమాలో దాదాపుగా 45 నిమిషాల పాటు యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయని తెలుస్తోంది. త్వరలోనే అఖండ టీమ్ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి స్పష్టత రానుంది.
ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ రోల్ లో నటిస్తుండగా ప్రగ్య జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ రోల్ లో నటిస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహా, లెజెండ్ సినిమాల తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అఖండ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచగా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!