అకిరా నందన్.. ఈ పేరు సోషల్ మీడియాలో ఒక్కసారి హల్‌చల్ చేస్తే చాలు, ట్రెండ్ ఆగదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారసుడు అనే ట్యాగ్ మాత్రమే కాదు, అతని పర్సనాలిటీ, స్టైల్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సినీ ఎంట్రీ ఇంకా అనౌన్స్ అవ్వకముందే ఇంత హైప్ అంటే.. వెండితెరపై కనిపించిన తర్వాత ఇంకెంత దుమ్ము దులిపేస్తాడో అన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో తారాస్థాయికి చేరింది. ఇటీవల తండ్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి దేవాలయ యాత్రలో కనిపించిన అకిరా నందన్ (Akira Nandan) గెడ్డం లుక్‌లో పవర్‌ఫుల్ ప్రెజెన్స్‌తో ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేశారు.
సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్ అయ్యి, ‘‘పవర్ స్టార్ వారసుడు వస్తున్నాడు’’ అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. తండ్రి రాజకీయాల్లో చారిత్రక విజయాలు సాధిస్తుండగా, అకిరా సినీ ఎంట్రీ ఎప్పుడు అనేది అభిమానుల పెద్ద క్వశ్చన్‌గా మారింది. అకిరా పై హైప్ పెరగడానికి కారణం ఇటీవల వైరల్ అవుతున్న ఓ ఫ్యాన్ మేడ్ వీడియో. ప్రభాస్ (Prabhas) మిర్చి (Mirchi) సినిమాలోని పవర్‌ఫుల్ డైలాగ్‌లతో అకిరా విజువల్స్ కట్ చేసి విడుదల చేసిన ఆ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది.
‘‘ఎవర్రా ఈ కుర్రోడు!’’ అనిపించేలా ఉన్న ఆ ఎడిట్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ ఇచ్చింది. అకిరా నందన్ గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అతను కేవలం పవర్ స్టార్ కొడుకు కాదు.. ఒక ఆల్‌రౌండర్. విదేశాల్లో నటనలో శిక్షణ తీసుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్, డాన్స్, మ్యూజిక్‌లోనూ స్పెషలిస్ట్ అని టాలీవుడ్ వర్గాల్లో టాక్.
ఇలాంటి టాలెంట్ ఉన్న వారసుడి సినిమా ఎవరైతే డైరెక్ట్ చేస్తారో ఆ డైరెక్టర్‌కు అది కెరీర్‌లోని బిగ్ బ్రేక్ అవుతుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం అకిరా వయస్సు 20. ఇక అతని బిగ్ స్క్రీన్ ఎంట్రీకి ఎంతో సమయం లేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి ఆ కల ఎప్పుడు నిజమవుతుందో చూడాలి.
This edit #AkiraNandan | @PawanKalyan pic.twitter.com/PE4N9sd8Jm
— ✒ త్రివిక్రమ్ ᶠᵃⁿ ✍️ (@Harinani_) February 12, 2025