Nagarjuna: నాగార్జున ఇంట్లో విషాదం…కన్నుమూసిన నాగ సరోజ!

అక్కినేని నాగార్జున ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నాగార్జున ముగ్గురు సోదరీమణులలో ఒకరైనటువంటి నాగ సరోజ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మంగళవారం కన్నుమూశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు సంతానంలో ఒకరైనటువంటి నాగ సరోజ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈమె మంగళవారం కన్ను మూసినట్లు తెలుస్తోంది. అయితే అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కుమార్తె సత్యవతి చాలా సంవత్సరాల క్రితమే మరణించారు.

ఇక తాజాగా నాగ సరోజ మరణించారు. అక్కినేని కుటుంబం సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ నాగ సరోజ మాత్రం ఎప్పుడు మీడియాకు దూరంగా ఉండేది. ఈమె ఎలాంటి సినిమా వేడుకలు జరిగిన కూడా ఆ వేడుకలకు హాజరయ్యేది కాదు దీంతో పెద్దగా నాగ సరోజ గురించి అభిమానులకు తెలియదు. ఇక చిన్న కుమార్తె నాగ సుశీల మాత్రం అందరికీ సుపరిచితమే ఈమె నిర్మాతగా కూడా వ్యవహరించేవారు.

అలాగే ఎన్నో సినిమా వేడుకలకు అక్కినేని కుటుంబ వేడుకలలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటూ సందడి చేసేవారు. నాగ సుశీల అందరికీ సుపరితమైనప్పటికీ నాగ సరోజ మాత్రం పెద్దగా ఎవరికి తెలియక పోయినప్పటికీ ఈమె మరణించారనే వార్త తెలియడం ప్రతి ఒక్కరు సానుభూతి తెలియజేస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus