ఝాన్సీ, సద్దామ్ , చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట, శివ కుమార్ తదితరులు (Cast)
మారేష్ శివన్ (Director)
కొమ్మలపాటి సాయి సుధాకర్ (Producer)
సుభాష్ ఆనంద్ (Music)
ఆండ్రూ (Cinematography)
Release Date : నవంబర్ 10, 2023
ఈసారి దీపావళి పండుగకి ఒక్క పెద్ద సినిమా కూడా థియేటర్లలో రిలీజ్ కావడం లేదు. నవంబర్ నెల టాలీవుడ్ కి అన్ సీజన్ కావడం, మరోపక్క వరల్డ్ కప్ మ్యాచుల్లో భారత్ వీరవిహారం చేస్తుండటం కూడా దీనికి కారణం అనుకోవచ్చు. అయినప్పటికీ ‘జపాన్’ ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ వంటి డబ్బింగ్ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. క్రేజ్ విషయంలో వీటికి సరితూగే మూవీ అని చెప్పలేం కానీ.. టీజర్, ట్రైలర్స్ బట్టి కొంత విషయం ఉన్న మూవీగా ‘అలా నిన్ను చేరి’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.హెబ్బా పటేల్, ‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించడం కొంత ఆకర్షించే విషయం.మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుల్ని మెప్పించిందో ఇప్పుడు తెలుసుకుందాం రండి :
కథ: వైజాగ్ సమీపంలో ఉన్న ఓ గ్రామానికి చెందిన వ్యక్తి గణేష్(దినేష్ తేజ్). ఇతనికి నటన పై వ్యామోహం ఎక్కువ. అందుకే ఛాన్స్ దొరికిన ప్రతిసారీ తన స్నేహితులతో కలిసి నాటకాలు వేస్తుంటాడు.ఎప్పటికైనా దర్శకుడు అవ్వాలి అనేది ఇతని గోల్. అయితే తన స్నేహితుడి పెళ్లి కోసం వచ్చిన అమ్మాయి దివ్య(పాయల్ రాధాకృష్ణ)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. కానీ దివ్య తల్లికి ఇది నచ్చదు. గణేష్ నుండి ఆమెను దూరం చేయాలని దివ్యకి ఓ పొలిటీషియన్(శత్రు) తో వెంటనే పెళ్లి ఫిక్స్ చేసేస్తుంది.
ఆ పెళ్లి ఆపడానికి వచ్చిన గణేష్ ను.. పెళ్ళికొడుకు అనుచరులు చితక్కొడతారు. దీంతో అతను కోమాలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? దివ్యని మర్చిపోవడానికి గణేష్ ఏం చేశాడు? మధ్యలో అను(హెబ్బా పటేల్) .. గణేష్ కి ఎలా దగ్గరైంది. దర్శకుడు కావాలనే కల గణేష్ నెరవేర్చుకున్నాడా? లేదా? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటుల పనితీరు: దినేష్ తేజ్ ప్రామిసింగ్ హీరో అనే అభిప్రాయం యూత్ లో ఉంది. ‘హుషారు’ నుండి అతను దాన్ని ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. కథల ఎంపిక విషయంలో కూడా ఇతనికి మంచి టేస్ట్ ఉంది. ఈ సినిమాతో మరోసారి అది ప్రూవ్ అయ్యింది. గణేష్ పాత్రలో అతను డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. హెబ్బా పటేల్ ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్. ఈమె హీరోయిన్ అనలేము కానీ సపోర్టింగ్ రోల్ కి ఎక్కువ అన్నట్టు ఉంటుంది. ఈమె గ్లామర్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి.
అయితే ఈమె కంటే మరో హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ ఎక్కువ మార్కులు కొట్టేసింది అని చెప్పాలి. ఆమె లుక్స్ కూడా బాగున్నాయి. శత్రు బాగా పెర్ఫార్మ్ చేశాడు. మహేష్ ఆచంట.. కూడా సపోర్టింగ్ రోల్లో మెప్పించాడు. ఝాన్సీ ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు మారేష్ శివన్ ఎంపిక చేసుకున్న కథ కొత్తదేమీ కాదు. కానీ యూత్ కనెక్ట్ అయ్యే అంశాలను జోడించి.. ఎమోషన్స్ ని, కామెడీ ని హైలెట్ చేశాడు. ఆ ప్రయత్నమే వర్కౌట్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ ఫన్నీ ఫన్నీగా వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ క్లైమాక్స్ అందరికీ సంతృప్తికరమైన ఫీలింగ్ ను ఇస్తుంది.
మొత్తంగా దర్శకుడికి మంచి మార్కులే పడతాయి. ఆండ్రూ సినిమాటోగ్రఫీ ఓకే. సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ కంపోజ్ చేసిన రెండు పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. సినిమాలో కొన్ని డైలాగ్స్ కూడా బాగా పేలాయి. నిర్మాణ విలువలు ఓకే.
విశ్లేషణ: పెద్దగా చప్పుడు లేకుండా వచ్చిన ఈ (Ala Ninnu Cheri) ‘అలా నిన్ను చేరి’ .. డీసెంట్ వాచ్ అనే టాక్ రాబట్టుకునే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి. సెకండ్ హాఫ్ కొంత స్లో అనే కంప్లైంట్ ఉన్నా యూత్ కి కనెక్ట్ అయ్యే కామెడీ, మెసేజ్ ఉంది కాబట్టి.. ఈ వీకెండ్ కి ఒకసారి హ్యాపీగా ట్రై చేయొచ్చు.
రేటింగ్: 2.5/5
Rating
2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus