అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ‘అల వైకుంఠపురములో. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ మరియు ‘గీత ఆర్ట్స్’ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతమే అందించాడు. ఇప్పటికే విడుదల చేసిన పాటలకు అద్భుతమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఓ విధంగా పాటలతోనే ఈ సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయని చెప్పొచ్చు. అందుకు తగినట్టుగానే ఈ చిత్రానికి మంచి బిజినెస్ జరిగింది.
ఇక ‘అల వైకుంఠపురములో’ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం
20 cr
సీడెడ్
12.06 cr
ఉత్తరాంధ్ర
8.50 cr
ఈస్ట్
6.30 cr
వెస్ట్
5 cr
కృష్ణా
5 cr
గుంటూరు
6.30 cr
నెల్లూరు
2.78 cr
ఏపీ + తెలంగాణ
65.94 cr(share)
రెస్ట్ ఆఫ్ ఇండియా
8.60 cr (corrected)
ఓవర్సీస్
9.80 cr
టోటల్ వరల్డ్ వైడ్
84.34 cr (share)
‘అల వైకుంఠపురములో’ చిత్రానికి 84.34 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 85 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. చెప్పాలంటే బన్నీ, త్రివిక్రమ్ లకి ఈ టార్గెట్ చాలా ఈజీ అనే చెప్పాలి. ‘డీజే’ లాంటి యావరేజ్ చిత్రంతోనే అల్లు అర్జున్ 72కోట్ల షేర్ ను రాబట్టాడు. ఇక త్రివిక్రమ్ గత చిత్రం ‘అరవింద సమేత’ .. 88 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. సో.. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ అవ్వడం గ్యారంటీ అని బలంగా చెప్పొచ్చు.