అల వైకుంఠపురంలో చిత్రానికి ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ కి అల్లు అర్జున్ అండ్ టీమ్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం బన్నీ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకుంది. గతానికి భిన్నంగా ఓవర్ సీస్ లో కూడా ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకోవడం గమనార్హం. ఇప్పటికే మీడియా వేదికగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్స్ లో పాల్గొన్నారు. ఐతే అభిమానుల సమక్షంలో బహిరంగంగా ఈ చిత్ర విజయోత్సవ సభ నిర్వహించాలని నిర్మాతలు భావిస్తున్నారు.
బీచ్ సిటీ వైజాగ్ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈనెల 18వ తేదీన వైజాగ్ లో అల వైకుంఠపురంలో మూవీ సక్సెస్ మీట్ జరగనుంది. భారీ ఎత్తున అట్టహాసంగా జరగనున్న ఈ వేడుక, చిత్ర ప్రమోషన్స్ కి కూడా ఉపయోగపడుతుందని వారి ఆలోచన. ప్రీ రిలీజ్ వేడుకకు చిత్ర పరిశ్రమ నుండి ఏ ప్రముఖ హీరోని ఆహ్వానించకుండా జరుపుకున్న బన్నీ.. మరి కనీసం విజయోత్సవ వేడుకకు ఎవరినైనా పిలుస్తాడో లేదో చూడాలి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి అల వైకుంఠపురంలో చిత్రాన్ని నిర్మించగా, త్రివిక్రమ్ తెరకెక్కించారు. గతంలో బన్నీతో డీ జే చిత్రంలో నటించిన పూజ హెగ్డే మరో మారు అతనికి జంటగా నటించింది. అల వైకుంఠపురంలో చిత్రానికి సంగీతం థమన్ అందించారు.