నందమూరి తారకరత్న గుండెపోటుతో అకాల మరణం పొందిన విషయం మనకు తెలిసిందే.ఇలా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నటువంటి తారకరత్న గుండెపోటుకు గురై ఈ ఫిబ్రవరి 18వ తేదీ మరణించారు. తారకరత్న మరణించడంతో తన భార్య అలేఖ్య రెడ్డి తరచు తన భర్తను తలుచుకుంటూ కుమిలిపోతున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈమె తన భర్తతో తనకు ఉన్నటువంటి జ్ఞాపకాలను అందరితో పంచుకుంటున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో హీరోగా తన కెరియర్ ప్రారంభించిన నందమూరి తారకరత్న ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు.
ఈ క్రమంలోనే తన తాతయ్య స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఆయన కొనసాగాలని భావించారు. వచ్చే ఎన్నికలలో గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తారకరత్న అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు.అయితే ఉన్నఫలంగా ఈయన మరణించడంతో తన భర్త చివరి కోరికను తీర్చడానికి అలేఖ్యరెడ్డి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం గుడివాడ ఎమ్మెల్యేగా కొడాలి నాని ఉన్న విషయం మనకు తెలిసిందే.
అయితే కొడాలి నానికి చెక్ పెట్టాలి అంటే నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డిని ఎన్నికల బరిలో నిలబెట్టాలని టిడిపి భావించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో గుడివాడ ఎమ్మెల్యేగా అలేఖ్యరెడ్డి ఎన్నికల బరిలో దిగబోతున్నారట పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుడివాడ నుంచి పోటీ చేయాలన్నది తారకరత్న కల ఆ కోరిక తీరకుండానే తారకరత్న మరణించారు.
అందుకే తన భర్త చివరి కోరికను తీర్చడానికి అలేఖ్య రెడ్డి (Alekhya Reddy) కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.కానీ ఈ విషయం గురించి చంద్రబాబు నాయుడు నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదని సమాచారం.చంద్రబాబు నాయుడు గుడివాడ ఎమ్మెల్యే టికెట్ అలేఖ్య రెడ్డికి ఇస్తే ఈమె తప్పకుండా పోటీ చేయడానికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.