Alia Bhatt: నాకు సరైంది అనిపిస్తేనే చేస్తా.. మరోసార ఇలా అడగొద్దు: ఆలియా ఫైర్‌

స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానం… చాలా ఏళ్లుగా జరుగుతున్న చర్చ ఇది. ఎప్పటికప్పుడు ఈ విషయంలో ఓ సహేతుక నిర్ణయం వస్తున్నా.. ఇంకా చర్చ జరుగుతూనే ఉంటుంది. ప్రతి రంగంలోనూ ఈ విషయంలో డిస్కషన్‌ ఉంటుంది. దీనికి సినిమా రంగం కూడా తక్కువేం కాదు. రెమ్యూనరేషన్ల దగ్గర నుండి, సౌకర్యాల వరకు ఈ విషయంలో చర్చ జరుగుతుంది. దీంతోపాటు నటన, కెరీర్‌ విషయంలోనూ చర్చలు జరుగుతుంటాయి. తాజాగా మరోసారి కథానాయిక ఆలియా భట్ ఈ విషయాన్ని చర్చకు తీసుకొచ్చింది.

ఆలియా మాటలు విన్న నెటిజన్లు గ్రూపులుగా విడిపోయారు. కొంతమంది ఆమె చెప్పింది నిజమే కదా అంటుంటే.. మరికొంతమందేమో గత కొన్నేళ్లుగా ఇలానే జరుగుతోంది కదా అంటున్నారు. ఇంకొందరేమో ఈ చర్చ ఎందుకు అని అంటున్నారు. ఇంతకీ ఇంత చర్చ జరిగిన విషయం ఏంటి అని అనుకుంటున్నారా. ‘‘కెరీర్‌లో మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలో తల్లి కావాలని ఎందుకు అనిపించింది?’’ అని. అదేంటి ఈ ప్రశ్న హీరోలకు ఏం సంబంధం అని అనుకుంటున్నారా?

మీ ప్రశ్న కరెక్టే.. అయితే ఇదే ప్రశ్నకు (Alia Bhatt) ఆలియా చెప్పిన సమాధానం వింటే ఆమె కూడా కరెక్టే అని అంటారు. కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడే తన ప్రియుడు రణ్‌బీర్‌ కపూర్‌ను అలియా భట్‌ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వెంటనే ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఎంచక్కగా సినిమాలు ఓకే చేస్తూ.. కెరీర్‌ను మళ్లీ స్పీడప్‌ చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘‘కెరీర్‌లో మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలో తల్లి కావాలని ఎందుకు అనిపించింది? అనే ప్రశ్న ఎదురైంది ఆలియాకు.

దీనికి సమాధానం చెప్పాల్సిన ఆలియా.. ‘‘ఇదే ప్రశ్న మీరు హీరోలను ఎందుకు అడగరు. వాళ్లను కూడా ఇదే మాట అడగొచ్చుగా’’ అని అంది. దీంతో కాస్త కన్‌ఫ్యూజ్‌ అయ్యారు మీడియా జనాలు. ‘‘ఇప్పటివరకూ మా పాపకు సంబంధించిన చాలా విషయాలను రణ్‌బీర్‌ను అడిగారు కదా.. మరి కెరీర్‌లో పీక్స్‌లో ఉన్నప్పుడు పిల్లలు ఎందుకు అని ఆయన్ని అడగలేదు. ఇలాంటి ప్రశ్నలను హీరోయిన్లనే ఎందుకు అడుగుతారు’’ అంటూ కాస్త కస్సుబుస్సుమంది.

కెరీర్‌ మొదలైన 10 సంవత్సరాల తర్వాత తాను పిల్లల్ని కన్నాను. ఈ విషయంలో ఆనందంగా ఉన్నాను అని ముగించింది. అయినా నేను ఏ నిర్ణయం తీసుకున్నా సరైంది అనిపిప్తేనే చేస్తానని, నచ్చకుండా ఏ పనీ చేయను అని చెప్పింది ఆలియా. నాకు నచ్చక పెద్ద సినిమాలు వదులుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మరోసారి ఇలాంటి ప్రశ్న అడగొద్దు అంటూ కోపాన్ని చూపించింది ఆలియా.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus