మతిపోగొడుతున్న ఆర్ ఆర్ ఆర్ కోసం అలియా రెమ్యూనరేషన్!

దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ లో అలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ లో అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్న చరణ్ కి జంటగా అలియా నటిస్తుంది. ఆమె సీత పాత్రలో రామరాజు ప్రియురాలిగా కనిపిస్తుంది. కాగా ఆర్ ఆర్ ఆర్ కొరకు అలియా రెమ్యూనరేషన్ పై ఇప్పటికే అనేక పుకార్లు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.

తాజా సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ కోసం అలియా దాదాపు 4 నుండి 5 కోట్ల రూపాయలు పారితోషికంగా అందుకుందట. సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్స్ కూడా అంత రెమ్యూనరేషన్ తీసుకున్న దాఖలాలు లేవు. టాలీవుడ్ లో టు టైర్ హీరోలు అంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అంటే ఓ స్థాయి హీరోకి ఇచ్చిన మొత్తాన్ని అలియా భట్ తీసుకుంటుంది. దానికితోడు అలియా పాత్రకు పెద్ద నిడివి కూడా ఉండదు.

ఒకటి రెండు సాంగ్స్ మరియు కొన్ని సన్నివేశాలు ఉంటాయని సమాచారం. ఇది ఇద్దరు టాప్ స్టార్స్ నటిస్తున్న మల్టీ స్టారర్ కావడంతో సినిమా మొత్తం ఎన్టీఆర్ మరియు చరణ్ లకు సంబంధించిన సన్నివేశాలతో నిండిపోయి ఉంటుంది. మరి అంత తక్కువ నిడివి గల పాత్రకు అలియాకు అంత పెద్ద మొత్తంలో చెల్లించి తీసుకోవడానికి కారణం, కేవలం బాలీవుడ్ మార్కెట్ కోసమే. బాలీవుడ్ లో మూవీకి హైప్ రావాలంటే అక్కడి హీరోయిన్ అయి ఉండాలి.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus