Eesha Rebba: హాట్ టాపిక్ గా మారిన ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటోలు… మేటర్ ఏంటంటే?

కొన్నాళ్లుగా తెలుగమ్మాయి అనే పదం వినపడితే అందరూ ఈషా రెబ్బా అనే అంటున్నారు. చూడటానికి అంత చక్కగా ఉంటుంది మరి ఆ అమ్మాయి. సినిమాల పరంగా ఈమె భారీ సక్సెస్ లు చూసిన సందర్భాలు ఏమీ లేవు.అలా అని ఆఫర్లు లేకుండా ఖాళీగా కూర్చున్న సందర్భాలు కూడా లేవు.ఇప్పుడైతే వరుస సినిమాల్లో, వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ తో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు అటు తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అంతకుముందు ఆ తర్వాత’ చిత్రంతో హీరోయిన్ గా మారింది.

అతని డైరెక్షన్లోనే ఆ తర్వాత చేసిన ‘బందిపోటు’ నిరాశపరిచింది. దీంతో (Eesha Rebba) ఆమెకు అవకాశాలు కూడా పెద్దగా రాలేదు.కొంత గ్యాప్ తర్వాత వచ్చిన ‘అమీ తుమీ’ ‘దర్శకుడు’ ‘అ!’ ‘అరవింద సమేత’ ‘సవ్యసాచి’ ‘రాగల 24 గంటల్లో’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి చిత్రాల్లో నటించింది. ‘లస్ట్ స్టోరీస్’ రీమేక్ అయిన ‘పిట్ట కథలు’ ‘3 రోజెస్’ వంటి వెబ్ సిరీస్లలో కూడా నటించింది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో ఈషా రెబ్బా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫొటోలకి బోలెడన్ని లైకులు షేర్లు వస్తుంటాయి. తాజాగా ఈ అమ్మడు కొన్ని ఫోటోలు షేర్ చేసింది. పచ్చని చీర తలలో మల్లెపూలు పెట్టుకుని చాలా చక్కగా ఆ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అంతేకాదు ఆ ఫొటోలకి ‘ఎదురుచూస్తున్నా’ ‘నా హృదయం సిగ్గుపడుతుంది’ అంటూ కామెంట్లు పెట్టింది. ఇవి చూసిన నెటిజన్లు ఈషా రెబ్బా పెళ్లికి రెడీ అయిపోయింది.. త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతుంది అనే హింట్ ఇస్తుంది’ అంటూ కామెంట్లు మొదలుపెట్టారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus