‘కమిటీ కుర్రోళ్ళు’ తర్వాత నిహారిక చేయబోయే సినిమా ఇదే..!

నిహారిక కొణిదెల  (Niharika Konidela)  మొన్నామధ్య సినిమాలకి కొంచెం బ్రేక్ ఇచ్చారు. ఆ టైంలో సోషల్ మీడియాలో తన ఫ్రెండ్స్ సినిమాలకి రివ్యూలు ఇస్తూ అభిమానులతో టచ్లో ఉన్నారు. తర్వాత ఆమె పర్సనల్ లైఫ్లో కొన్ని సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వాటి నుండి బయటపడి మళ్ళీ సినీ కెరీర్ పై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఆమె ఆల్రెడీ పలు వెబ్ సిరీస్లలో నటించారు. అలాగే కొన్నిటిని నిర్మించారు కూడా. తర్వాత ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu) అనే సినిమాను నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

Niharika

వాస్తవానికి ఆ సినిమాని మొదలు పెట్టిన నిర్మాణ సంస్థ వేరు… మధ్యలో ఆగిపోతే ముందుకు తీసుకెళ్లిన ప్రొడక్షన్ హౌస్ వేరు. తర్వాత ఆ సంస్థ కూడా డ్రాప్ అయితే నిహారిక టేకప్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది. ఫైనల్ గా ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో నిర్మాతగా నిహారికకి తొలి సక్సెస్ అందినట్టు అయ్యింది. ఇక ‘కమిటీ కుర్రోళ్ళు’ సక్సెస్ తో నిహారిక వరుసగా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు.

కొంచెం టైం తీసుకుని మంచి ప్రాజెక్టులు చేయాలని ఆమె డిసైడ్ అయ్యింది. ఫైనల్ గా తన ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ లో ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, ‘బెంచ్ లైఫ్‌’ అనే వెబ్ సిరీస్‌ల‌కు క్రియేటీవ్ హెడ్ గా పనిచేసిన మాన‌స శ‌ర్మని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఒక సినిమా చేయబోతుంది. ఈ సినిమాను కూడా అంతా కొత్త వాళ్ళతో లేదా యూట్యూబ్ స్టార్స్ తో చేసే అవకాశాలు ఉన్నాయని వినికిడి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus