టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్లు ఊహించడం కష్టం, కానీ సెట్ అయితే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. ఇప్పుడు అలాంటి ఓ క్రేజీ, అన్‌ఎక్స్‌పెక్టెడ్ కాంబోపై వస్తున్న వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పాన్-ఇండియా స్టార్ ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కలిసి ఓ సినిమా చేయబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.లేటెస్ట్ టాక్ ప్రకారం, సుకుమార్ రెండు వారాల క్రితం ప్రభాస్‌కు ఓ పవర్‌ఫుల్ స్టోరీలైన్ వినిపించారట. కథ విపరీతంగా నచ్చడంతో ప్రభాస్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ మెగా ప్రాజెక్ట్‌ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించనున్నారు. విశేషం ఏంటంటే, అల్లు అర్జున్ ‘పుష్ప 3’ ప్రాజెక్ట్ కంటే ముందే ఈ సినిమాను పట్టాలెక్కించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ ప్రాజెక్టులున్నాయి. ‘కల్కి 2898 AD – పార్ట్ 2’, ‘సలార్ పార్ట్ 2’ సీక్వెల్స్‌తో పాటు, మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’, హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఓ సినిమా, సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ వంటి చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ సుకుమార్‌కు డేట్స్ కేటాయించడం ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యతను తెలియజేస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ ఊహించని కాంబినేషన్ వార్త మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ లో ఆసక్తి పెంచుతుంది. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే పుష్ప 3 కంటే ముందుగా రామ్ చరణ్ తో ఒక సినిమా చేస్తున్నట్టు సుకుమార్ టీం ప్రకటించి 2 ఏళ్ళు దాటింది. మరి ఆ ప్రాజెక్టు సంగతేంటి? అనేది అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రశ్న.