Pushpa Songs: యూట్యూబ్‌లో అరుదైన ఘటన సాధించిన ‘పుష్ప’

  • January 4, 2022 / 08:46 PM IST

‘పుష్ప’ ఓవైపు థియేటర్‌లో సందడి చేస్తోంటే… మరోవైపు యూట్యూబ్‌లో అదరగొడుతోంది. థియేటర్‌లో సినిమా రికార్డు వసూళ్లు సాధిస్తుంటే, యూట్యూబ్‌లో ఆ సినిమా పాటలు వ్యూస్‌ రికార్డు బద్దలు కొడుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు సినిమాలో పాటలన్నీ… టాప్‌ 100లో ఉన్నాయి. ఓ సినిమా పాటలన్నీ ఇలా యూట్యూబ్‌ టాప్‌ 100లో ఉండటం అంటే ఆసక్తికరమే కదా. యూట్యూబ్‌ ప్రతి వారం టాప్‌ 100 పాటల జాబితాను విడుదల చేస్తుంటుంది. అలా ఈ వారం జాబితా బయటకు వచ్చింది.

‘పుష్ప’ సినిమా థియేటర్‌లో ఆ మాత్రం దూసుకుపోతోంది అంటే… సంగీతం కూడా ఓ కారణమని చెప్పొచ్చు. దేవిశ్రీప్రసాద్‌ అందించిన పాటలు జనాలను థియేటర్లకు రప్పించాయని చెప్పొచ్చు. ఫస్ట్‌ పాట వచ్చినప్పటి నుండి… ఆఖరి పాట వరకు అన్నీ అలరించాయి, అలరిస్తూనే ఉన్నాయి.ఇప్పటికే వాటి జోరు అలానే కొనసాగుతోంది. అన్ని స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లోనూ ‘పుష్ప’ పాటల సందడి చూడొచ్చు. ఇక వీడియో సాంగ్స్‌ విషయంలోనూ అదే జోరు ఉందదని యూట్యూబ్‌ కొత్త లిస్ట్‌ చూస్తే అర్థమవుతోంది.

సినిమాలోని మొత్తం ఐదు పాటలు టాప్‌ 100లో వివిధ స్థానాల్లో ఉన్నాయి. టాప్‌ 1, 2‘పుష్ప’కు సంబంధించినవే కావడం విశేషం. ప్రపంచంలోని పాటలన్నింటిలో టాప్‌ 1, 2 తెలుగు సినిమా పాటలకు దక్కడం స్పెషలే కదా. సమంత కుర్రకారుకి పిచ్చెక్కించిన ‘ఉ అంటావా ఊ ఊ అంటావా’ తొలి స్థానంలో ఉంది. ఇక రెండో స్థానంలో రష్మిక మందన ప్రేమ కనిపిస్తోంది. అదే ‘సామి నా సామి..’ పాటను చూడొచ్చు.

ఆ తర్వాత మరో 22 స్థానాల తర్వాత మళ్లీ ‘పుష్ప’ వస్తుంది. శ్రీవల్లి గురించి పుష్పరాజ్‌ ప్రేమగా పాడుకునే ‘శ్రీవల్లి…’ సాంగ్‌ 24వ స్థానంలో ఉంది. మళ్లీ 50 స్థానాల వరకు పుష్ప కనిపించదు. తిరిగి 74వ ప్లేస్‌లో ‘దాక్కో దాక్కో మేక…’ చూడొచ్చు. ఆఖరి పాట ‘దాక్కో దాక్కో మేక…’. ఈ పాట ప్రస్తుతం 97వ స్థానంలో ఉంది. అలా మొత్తంగా ‘పుష్ప’ పాటలన్నీ… యూట్యూబ్‌ గ్లోబల్‌ టాప్‌ 100లో కనిపిస్తున్నాయి. తెలుగు సినిమా పాటలకు ఇలాంటి గౌరవం దక్కడం విషయమే.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus